Share News

AP Politics: రైతుకు రూ. 30‌ వేలు.. 2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 12 , 2024 | 06:39 PM

రిలయన్స్ తో చేసుకున్న కీలక ఒప్పందం ద్వారా కొత్తగా 2 లక్షలకు పైగా ఉద్యోగ కల్పన జరగనుందన్నారు. రైతులకు లబ్ధి చేకూరేలా లీజు పాలసీని ప్రవేశపెట్టబోతున్నట్టు సీఎం తెలిపారు.

AP Politics: రైతుకు రూ. 30‌ వేలు.. 2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రిలయన్స్ తో చేసుకున్న ఒప్పందం రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 500 సిబిజి ప్లాంట్‌లను మూడేళ్లలో పూర్తిచేస్తామన్నారు. దీని ద్వారా యువతకు ఉపాధి కల్పనతో పాటు రైతుకు లీజు పాలసీ ద్వారా రూ.30 వేల చొప్పున వచ్చేలా ప్రణాళిక వేస్తున్నామన్నారు.


రైతుకు రూ. 30 వేల లీజ్ పాల‌సీ

‘‘ 500 సిబిజి ప్లాంట్‌లు రానున్న మూడు సంవ‌త్సరాల్లో పూర్తిచేసేలా రిలయన్స్ తో ఎంవోయూ చేసుకున్నాం. దీని వ‌ల్ల 130 కోట్ల మేర ఒక్కో ప్లాంట్ కు 65వేల కోట్లు తో ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల 50 వేల ఉద్యోగాలను తీసుకువస్తున్నాం. ఏపి ‘ది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అయితే రిల‌య‌న్స్ ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ చేయాలి. 25 సంవ‌త్సరాల్లో 57వేల 650 కోట్లు బెనిఫిట్ వ‌స్తుంది. ఒక్కో రైతుకు 30 వేలు లీజ్ ఇచ్చేలా పాల‌సీ తెస్తున్నాం. ఏడాదికి 39 లక్షల మెట్రిక్ ట‌న్నుల ప్రొడక్షన్ సిబిజికి వ‌స్తుంది. దీని వ‌ల్ల ఇండ‌స్ట్రీయ‌ల్ గ్రోత్ భారీగా పెరగనుంది. 500ప్లాంట్ లు పూర్తిచేస్తే రిన్యూవ‌బుల్ ప్యూయ‌ల్ 9 లక్షల 35వేల ఎల్‌సి‌బిల‌కు రిప్లేస్‌మెంట్ వ‌స్తుంది. 110 లక్షల మెట్రిక్ ట‌న్నులు ఫెర్మెంటెడ్ ఆర్గానికి మెన్యూర్ వ‌ల్ల కెమికల్ ఫెర్టిలైజ‌ర్స్ వాడకం త‌గ్గుతుంది. రాష్ట్రంలో క్లీన్ ఎన‌ర్జీ పాల‌సీ 2024 ఇప్పటికే తీసుకువ‌చ్చాం. 10 లక్షల కోట్లు పెట్టుబ‌డులు ఈ పాల‌సీ ద్వారా ఆక‌ర్షించాల‌ని భావించాం. పాల‌సీ ద్వారా 7.5 లక్షల ఉద్యోగాలు అనుకుంటే 2. 5 లక్షల ఉద్యోగాలను రిల‌య‌న్స్ ప‌వ‌ర్ ఇస్తోంది’’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.

TDP: తప్పు చేసినవారిని ఎట్టి పరిస్థితుల్లో వదలం


Updated Date - Nov 12 , 2024 | 06:39 PM