AP Government : ఆప్కాబ్, డీసీసీబీ, డీసీఎంఎస్‌ల
ABN , Publish Date - Dec 22 , 2024 | 06:49 AM
ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్(ఆప్కాబ్), జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎ్‌స)ల అధికారిక పర్సన్ ఇన్‌చార్జిల పదవీ..
పర్సన్ ఇన్‌చార్జిల పదవీ కాలం పెంపు
అమరావతి, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్(ఆప్కాబ్), జిల్లా సహకార కేంద్ర బ్యాంక్(డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎ్‌స)ల అధికారిక పర్సన్ ఇన్‌చార్జిల పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగిస్తూ శనివారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ఆప్కాబ్ అధికారిక పర్సన్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న సహకారశాఖ కమిషనర్ పదవీ కాలాన్ని 2025 జనవరి 18 నుంచి జూలై 17వరకు పెంచింది. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల డీసీసీబీలకు అధికారిక పర్సన్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ల పదవీ కాలాన్ని ఈ నెల 27 నుంచి ఆరు నెలలు పొడిగించింది. 13 డీసీఎంఎ్‌సలకు పర్సన్ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ల పదవీకాలాన్ని వచ్చే జూన్ 26 వరకు పొడిగించింది. తాజాగా, పీఏసీఎ్‌సల అధికారిక పర్సన్ ఇన్‌చార్జిల పదవీ కాలాన్ని ప్రభుత్వం మరో ఆరు నెలలు పొడిగించింది. ఎన్నికలు జరిగే వరకు వారు కొనసాగనున్నారు.