PDS Rice: సిట్ సభ్యులపై విమర్శలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Dec 31 , 2024 | 07:11 PM
PDS Rice: రేషన్ బియ్యం అక్రమ రవాణా వ్యవహారంపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి, డిసెంబర్ 31: ప్రజా పంపిణి వ్యవస్థకు చెందిన బియ్యం అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయించింది. అందులోభాగంగా గతంలో బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తునకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసింది. అయితే సిట్‌లో కొందరు సభ్యుల నియామకంపై తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తాయి. దీంతో సిట్ బృందంలో పలు మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
అందులోభాగంగా సిట్‌లో సభ్యులుగా సీఐడీ ఎస్పీ బి. ఉమా మహేశ్వర రావు, బీసీ సంక్షేమ శాఖ కాకినాడ ఈడీ ఏ. శ్రీనివాస రావు, మహిళా శిశు సంక్షేమ శాఖ కర్నూలు ఆర్జేడీ పి.రోహిణి, విజయనగరం జిల్లా పౌర సరఫరాల అధికారి కే. మధుసూదన్ రావు, కోనసీమ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ బాల సరస్వతి నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇక గతంలో సిట్‌లో నలుగురు డీఎస్పీలను నియమించిన సంగతి తెలిసిందే. వారిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో వివిధ శాఖలకు చెందిన అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సిట్‌లో ఇద్దరు ఐపిఎస్ అధికారులు, ఇద్దరు డిప్యూటీ కలెక్టర్ హోదా అధికారులతోపాటు పౌర సరఫరాల శాఖకు చెందిన ఉన్నధికారులను ప్రభుత్వం నియమించింది. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కాకినాడలో 13 కేసులు నమోదయ్యాయి. వీటిపై సిట్ సమగ్ర విచారణ చేపట్టనుంది.
Also Read: సారీ చెప్పిన సీఎం..ఎందుకంటే..
Also Read: గురుశరణ్ కౌర్ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం
మరోవైపు ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిన బియ్యం అక్రమంగా విదేశాలకు తరలిపోతున్నట్లు గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాకినాడలో పర్యటించారు. ఈ సందర్భంగా బియ్యం తరలించేందుకు సిద్దంగా ఉన్న నౌకను సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో బియ్యం అక్రమ రవాణా మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆ క్రమంలో ప్రభుత్వం రంగంలోకి దిగి చర్యలు చేపట్టింది.
Also Read: మీ బ్యాగు తగిలించుకొన్న తీరే.. మీరేమిటో చెబుతోంది
Also Read: రహదారిపై ఆగిన కారు.. రంగంలోకి ఎద్దులు
ఇంకోవైపు మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని భార్య పేర్ని జయసుధ పేరుతో ఉన్న గోడౌన్లో పీడీఎస్‌కు చెందిన వందలాది బియ్యం బస్తాలు మాయమైనట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు తమ తనిఖీల్లో గుర్తించారు. ఆ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారించారు. వారిలో ఈ బియ్యం.. కాకినాడ పోర్ట్ ద్వారా తరలించినట్లుు ఉన్నతాధికారుల విచారణలో ఒప్పుకున్నట్లు సమాచారం. దీంతో వారిని అరెస్ట్ చేసేందుకు ఇప్పటికే రంగం సిద్దమైంది. ఇక ఇదే కేసులో పేర్ని నాని సతీమణి జయసుధకు ముందస్తు బెయిల్ కోర్టు మంజూరు చేసిన విషయం విధితమే.
For AndhraPradesh News And Telugu News