Share News

Jethwani Case: జెత్వానీ కేసులో కీలక పరిణామం.. ఐపీఎస్ విశాల్ గున్నీకి ఊరట

ABN , Publish Date - Sep 25 , 2024 | 12:33 PM

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. అక్టోబర్ 1వ తేదీ వరకు గున్నీపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Jethwani Case: జెత్వానీ కేసులో కీలక పరిణామం.. ఐపీఎస్ విశాల్ గున్నీకి ఊరట

అమరావతి: వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబై హీరోయిన్ కాదంబరి జెత్వానీకి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా దానిపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. అక్టోబర్ 1వ తేదీ వరకు గున్నీపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక పిటిషన్‌పై తదుపరి విచారణను అక్టోబర్ 1కి హైకోర్ట్ వాయిదా వేసింది.


కాగా జెత్వానీ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో కుక్కల విద్యాసాగర్ ఏ1గా ఉండగా ఏ2గా పీఎస్సార్ ఆంజనేయులు, ఏ3గా కాంతి రాణా, ఏ4గా వెస్ట్ జోన్ మాజీ ఏసీపీ హనుమంతరావు, ఏ5గా ఇబ్రహీంపట్నం మాజీ సీఐ సత్యనారాయణ, ఏ6గా విశాల్ గున్నీ ఉన్నారు.

మరోవైపు ఈ కేసులో ఏ1గా ఉన్న కుక్కల విద్యాసాగర్ కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. విద్యాసాగర్ ను విచారిస్తే పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ కేసులో పలు నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉన్న నేపథ్యంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

Updated Date - Sep 25 , 2024 | 12:41 PM