Share News

AP Politics: వైఎస్ జగన్‌పై మంత్రుల సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Oct 24 , 2024 | 08:13 PM

ప్రపంచంలో బుద్ధి, జ్ఞానం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది వైసీపీ అధినేత జగనేనని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జగన్ వారసత్వంగా వచ్చిన ఆస్తి కోసం తల్లి విజయను, సోదరి షర్మిలను పట్టి పీడిస్తున్నారని అన్నారు.

AP Politics: వైఎస్ జగన్‌పై మంత్రుల సంచలన వ్యాఖ్యలు

అమరావతి: ప్రపంచంలో బుద్ధి, జ్ఞానం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది వైసీపీ అధినేత జగనేనని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. జగన్ వారసత్వంగా వచ్చిన ఆస్తి కోసం తల్లి విజయను, సోదరి షర్మిలను పట్టి పీడిస్తున్నారని అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో దిశ చట్టం పేరుతో జగన్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టారని విమర్శించారు. "విద్యార్హతలు కూడా చెప్పుకోలేని వ్యక్తి జగన్. వైసీపీ పాలనలో తీసుకొచ్చిన దిశా చట్టంపై చర్చకు రావాలని మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. అయితే ఈ సవాల్‌ను స్వీకరించకుండా తాడేపల్లి ఇల్లు దాటి బయటకు రావడానికే జగన్ జంకారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేని వ్యక్తి.. నిప్పులాంటి నారా లోకేష్‍‌ని విమర్శిస్తే ఎవరూ సహించరు. విద్యాశాఖ మంత్రిగా ప్రాథమిక పాఠశాలలో చదివే విద్యార్థి దగ్గర్నుంచి అత్యున్నతమైన బోధన చేసే ఉపాధ్యాయుల మనసును లోకేష్ గెలుచుకున్నారు. తండ్రి పేరును నిలబెట్టే వ్యక్తి నారా లోకేష్ అయితే.. తండ్రి పేరును చెడగొట్టే వ్యక్తిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారు" అని మంత్రి మండిపడ్డారు.


శవ రాజకీయాలు చేస్తున్న జగన్..

మహిళల గురించి జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని మంత్రి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. తల్లి, చెల్లిని అనే బంధాన్ని చూడని నీచుడు జగన్ అని అన్నారు. "లోకేష్‌ని విమర్శించే స్థాయి జగన్‌కు లేదు. దిశా చట్టంపై చర్చకు సిద్ధమా. వైసీపీ శవ రాజకీయాలు చేస్తోంది. రాజకీయ లబ్ధి కోసమే పర్యటనలు చేస్తున్నారు" అని సత్యప్రసాద్ మండిపడ్డారు.

జగన్ పాలనలో అమరావతి రైతుల కష్టాలు..

మాజీ సీఎం జ‌గ‌న్‌ వల్ల అమరావతి రైతులు కష్టాలు పడ్డారని మంత్రి నారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల సమస్యలపై దృష్టి పెట్టినట్లు చెప్పారు. "అసెంబ్లీ, హైకోర్టు నిర్మాణానికి సంబంధించి 15 రోజుల్లో పాత కాంట్రాక్టులు రద్దు చేస్తాం. డిసెంబ‌ర్ చివ‌రిలోగా అన్నిప‌నుల‌కు టెండర్లు పిలుస్తాం. జ‌న‌వ‌రి నెలాఖ‌రుకు టెండ‌ర్ల ప్రక్రియ పూర్తిచేస్తాం. దాచేప‌ల్లిలో డ‌యేరియాపై అధికారుల‌తో చ‌ర్చించాం. నీటి నమూనాలను పరీక్షలకు పంపించాం" అని మంత్రి నారాయణ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Home Minister Anitha: ఆడపిల్లలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలన్నదే జగన్ ఆలోచన

Cyclone Dana: దూసుకొస్తున్న దానా తుఫాన్.. అధికారుల హెచ్చరికలు

Diwali: దీపావళి ఎఫెక్ట్.. సొంతూళ్లకు లక్షలాది మంది ప్రయాణం

AP Highcourt: నందిగం సురేష్ బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 24 , 2024 | 08:13 PM