AP Election: ఆంధ్రా ఓటరు ఎటు వైపు..?
ABN , Publish Date - Apr 17 , 2024 | 05:45 PM
రాష్ట్ర విభజన జరిగి.. మరికొద్ది రోజుల్లో దశాబ్దం పూర్తి చేసుకొంటుంది. అలాంటి వేళ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పనిలో పనిగా ఆంధ్ర్రప్రదేశ్ అసెంబ్లీకి సైతం ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే గతేడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓటరు పట్టం కట్టాడు.
రాష్ట్ర విభజన జరిగి.. మరికొద్ది రోజుల్లో దశాబ్దం పూర్తి చేసుకొంటుంది. అలాంటి వేళ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పనిలో పనిగా ఆంధ్ర్రప్రదేశ్ అసెంబ్లీకి సైతం ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే గతేడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓటరు పట్టం కట్టాడు.
AP Elections: వైసీపీ వెనుకంజకు కారణం అదేనా..?
దీంతో తెలంగాణలో అధికారాన్ని ఆ పార్టీ స్నేహగతం చేసుకొంది. మరి ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో అయితేనేమీ, లోక్‌సభ ఎన్నికల్లో అయితేనేమీ.. ఓటరు ఏ పార్టీకి పట్టం కడతారంటే.. ఓటరు నాడి మాత్రం.. ఏ మాత్రం అంతు పట్టని విధంగా ఉందనే ఓ చర్చ అయితే రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది.
గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల్లో వైసీపీకి ఓటర్లు పట్టం కట్టారు. దీంతో సీఎంగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమైనా ఉందా? అని ఎవరినైనా ప్రశ్నిస్తే.. సందేహమేననే సమాధనం వస్తుంది.
TG Elections: ఎన్నికల ముందు ఏంటిది రాజా.. బీజేపీలో అయోమయం!?
ఎందుకంటే రాష్ట్రానికి రాజధాని లేదు, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాలేదు. రాష్ట్రానికి ఏమైనా పరిశ్రమలు వచ్చాయా? అంటే అదీ లేదు. దీంతో రాష్ట్రంలోని యువత.. ఉపాధి కోసం పక్క రాష్ట్రాలకు పయనమవుతోంది. ఇక రాష్ట్రంలో రహదారుల పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైంది.
అయితే సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు.. వారి బ్యాంక్ ఖాతాల్లో ఈ ప్రభుత్వం నగదు వేస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. అలాంటి వేళ తమ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారిస్తాడా? లేకుంటే సంక్షేమ పథకాలు, ఉచిత హామీలకు లొంగిపోతాడా? అనే సందేహం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
Bonda Uma: అన్యాయంగా నా పేరు వాడుతున్నారు.. ఎవ్వరినీ విడిచిపెట్టా!.. బోండా ఉమా స్ట్రాంగ్ వార్నింగ్
ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం నిత్య కల్యాణం.. పచ్చ తోరణంలా నిత్యం కళకళలాడుతుండేది. అలాంటి రాష్ట్రం విభజనతో రెండుగా చీలిపోయింది. దీంతో నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిత్యం సమస్యల కొలిమిలో కొట్టుమిట్టాడుతోంది. అది నుంచి అన్ని సమస్యలే. వాటి నుంచి బయటపడేందుకు నవ్యాంధ్ర తొలి సీఎం నారా చంద్రబాబు నాయుడు దార్శనికతతో ముందుకు వెళ్లారు.
ఆ క్రమంలోనే రాష్ట్రానికి రాజధాని అమరావతి, ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టారు. కానీ అంతలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. ఆ ఎన్నికల్లో జగన్ పార్టీకి ఓటరు పట్టం కట్టారు.
ఆయన పాలనలో నాటి నుంచి నేటి వరకు రాష్ట్రం ఏమైనా పురోగమించిందా? లేదా? అంటే రాజకీయ వర్గాల్లో పెదవి సైతం విరుస్తున్నారు. మరోవైపు ఉచితాల పేరుతో నాయకులు.. తమ ప్రచారంలో ఉదరగొడుతున్నారు. ఆ హామీలకు పడిపోయి.. రాష్ట్రాభివృద్ధి గురించి పట్టించుకోకుంటే.. ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనేది ప్రజలేనని రాజకీయ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
Lok Sabha Elections: కేంద్ర ఏజెన్సీల ద్వారా ఫోన్ల ట్యాపింగ్.. ఈసీకి డీఎంకే ఫిర్యాదు
ఎందుకంటే ఉచితాలు చెప్పిన ఏ నాయకుడు తన సొంత జేబులో నుంచి నిధులు తీసి.. ప్రజలకు పప్పు బెల్లాల్లాగా పంచి పెడుతున్నారని గుర్తు చేస్తున్నారు. ఏ పథకం కింద నగదు పంచిపెట్టినా.. అది ప్రజలు వివిధ రూపాల్లో కట్టిన పన్నులేనని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రంలో జగన్ పాలనకు చరమ గీతం పాడేందుకు బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమిగా కలిసి వెళ్తున్నాయి. అలాంటి వేళ రాష్ట్రంలో అటు అసెంబ్లీకి, ఇటు లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లు ఏ రాజకీయ పార్టీకి జై కొడతారనేది అంతు పట్టకుండా ఉందనే ఓ చర్చ సైతం రాజకీయ వర్గాల్లో వైరల్ అవుతోంది.
KA Paul: రేపు విశాఖలో నామినేషన్లు వేస్తున్నా..
అంటే ప్రజలు రాష్ట్రాభివృద్ధికి పట్టం కడతారా? లేకుంటే సంక్షేమ పథకాల పేరుతో తమ బ్యాంక్ ఖాతాల్లో నేరుగా వచ్చిన పడుతున్న నగదు కోసం ఎదురు చూస్తారా? అనేది స్పష్టంగా తెలియాలంటే.. జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సిందేనని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ వార్తలు కోసం..