Share News

అస్తిత్వం కోల్పోతున్న అప్పన్నకుంట, Appannakunta is losing existence

ABN , Publish Date - Sep 01 , 2024 | 11:19 PM

మానవ మనుగడపై గా లి, కుంటలు, చెరువుల ప్రాముఖ్యత ఎంతో ఉంది. కుంటలు, చెరువులు ఉండడం వలన భూగర్భంలో జలవనరులు పెరిగి తాగు, సాగునీరు కొరత ఉండ దు. కుంటలు, చెరువుల ప్రాముఖ్యత తెలుసుకుని తెలంగాణలో అక్కడ ప్రభుత్వం చెరువుల్లో నిర్మించి న అక్రమ కట్టడాలను కూలుస్తున్నారు. కట్టుకున్న ది ఎవరనే ప్రశ్నలేకుండా చెరువుల ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ నిర్మా ణాలపై చర్యలు లేవు. వైసీపీ పాలనలో అడ్డూ అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో సుమారు 25 ఎకరాల్లో ఉన్న అప్పన్న కుంట రోజు రోజుకూ అస్తిత్వాన్ని కోల్పోతోంది.

అస్తిత్వం కోల్పోతున్న అప్పన్నకుంట, Appannakunta is losing existence

Appannakunta1F1.gifకంప చెట్ల నడుమ అప్పన్నకుంట

సుండుపల్లె, సెప్టెంబరు1: మానవ మనుగడపై గా లి, కుంటలు, చెరువుల ప్రాముఖ్యత ఎంతో ఉంది. కుంటలు, చెరువులు ఉండడం వలన భూగర్భంలో జలవనరులు పెరిగి తాగు, సాగునీరు కొరత ఉండ దు. కుంటలు, చెరువుల ప్రాముఖ్యత తెలుసుకుని తెలంగాణలో అక్కడ ప్రభుత్వం చెరువుల్లో నిర్మించి న అక్రమ కట్టడాలను కూలుస్తున్నారు. కట్టుకున్న ది ఎవరనే ప్రశ్నలేకుండా చెరువుల ఆక్రమణలపై కొరడా ఝులిపిస్తున్నారు. రాష్ట్రంలో అక్రమ నిర్మా ణాలపై చర్యలు లేవు. వైసీపీ పాలనలో అడ్డూ అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో సుమారు 25 ఎకరాల్లో ఉన్న అప్పన్న కుంట రోజు రోజుకూ అస్తిత్వాన్ని కోల్పోతోంది. ప్రస్తుతం చాప కింద నీరులా ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. నాడు వైసీపీ పాలనలో అడ్డూ అదుపు లేకుండా అక్రమ నిర్మాణాలు చేప ట్టారు. ప్రస్తుతం చాపకింద నీరులా అక్రమ నిర్మా ణాలు జరుగుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళితే...


కుంటను ఆక్రమించి చేపడుతున్న ఇంటి నిర్మాణం

House.gif

అప్పన్నకుంట సుమారు 20 ఏళ్ల కిందట మండల కేంద్రం నడి ఒడ్డున సుమారు 25 ఎకరాల్లో సర్వే నెంబరు 2169లో అప్పన్నకుంట ఉంది. ఈకుంట నుంచే మండల ప్రజలకు తాగు, సాగు నీటిని అందించేవారు. వందలాది ఎకరాల సాగుభూమికి సాగునీటిని అందించిన ఘనత ఈ కుంటకుంది. ఆక్రమణల కారణంగా అప్పన్నకుంట రాను రాను కుంచించుకుపోతోంది. చుట్టూ ఆక్రమణల కారణం గా కుంట విస్తీర్ణం రాను రాను తగ్గిపోతోంది. 2008లో వచ్చిన వరదల కారణంగా అప్పన్నకుంట తెగిపోయి మండలంలో సగం ఇండ్లు వరదనీటి ప్రవాహంలో మునిగిపోయాయి. అప్పట్లో పెద్ద మొ త్తంలో ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అలాంటి వర్షాలు కురవడం లేదు. కాబట్టి ఇటువంటి విప త్తులు కనిపించడం లేదు. అప్పన్నకుంట చుట్టూ కుంట కట్టను తవ్వి అక్రమ నిర్మాణాలు చేపట్టడం తో కుంట విస్తీర్ణం తగ్గిపోతోంది. భారీ వర్షాలు కురి స్తే మండల కేంద్రానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లగా కుంట చుట్టూ అంతులేని అక్రమాలు జరిగాయి. ఇదంతా అధికారులకు, పాల కులకు కనిపించడం లేదా అని విమర్శ లు వస్తున్నాయి. మండల కేంద్రంలో ఇంటి స్థలాలకు విపరీతమైన డిమాండ్‌ ఉండడంతో ఈ అక్రమాలు జరుగుతు న్నాయి. ఇదంతా అధికారులకు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొందరు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే విమర్శలు కూడా ఉన్నా యి. రాయచోటి ప్రధాన రహదారి పక్కన చర్చి వెనుక భాగంలో అప్పన్నకుంట కట్టను తవ్వి కుం టలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.


ఎంపీడీ ఓ కార్యాలయం సమీపంలోనే కాకుండా కుంట దక్షి ణ భాగంలో, తూర్పు భాగం సహా కుంటకు రెండు వైపులా ఉన్న మొరవను సైతం ఆక్రమించి నిర్మా ణాలు చేసేశారు. తెలంగాణ మాదిరి కుంటలు, చెరువుల రక్షణకు అధికారులు చర్యలు చేపడతారా లేదా వేచి చూడాలి. అక్రమ నిర్మాణాలు నిలపాల ని, కుంటను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Land.gifఆక్రమణల కోసం చదును చేసిన కుంట స్థలం

తేడా కనిపించడం లేదు

వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ స్థలాలు అన్యా క్రాంతమయ్యాయి. గుట్టలు, వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అనే తేడా లేకుండా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేప ట్టారు, కొందరు అమ్ముకున్నారు. ప్రభుత్వం మారిం దే కానీ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై చర్యలు మాత్రం కనిపించడం లేదు. ప్రభుత్వం మారినా అక్రమాలు చేస్తున్న వారు ఇంకా చేస్తూనే ఉన్నారు. అప్పట్లో లక్షలాది రూపాయలు ప్రభుత్వ స్థలాలు అమ్మి సొమ్ము చేసుకున్న వారు ప్రస్తుతం తమకు ఏమీ తెలియనట్లు ఉంటున్నారు. అధికారు లు సైతం అప్పుడు జరిగిన వాటిపై కదా మాకేమీ సంబంధం అన్న తీరుతో వ్యవహరిస్తున్నారని కూటమి నేతలు విమర్శిస్తున్నారు. ఆ ప్రభుత్వంలో కుంటలను ఆక్రమించి నిర్మాణాలు ఈ ప్రభుత్వం లో కుంట కట్టలను ఆక్రమించి నిర్మాణాలు చేస్తు న్నారు. రెండు ఒక్కటే కదా తేడా ఏమీ కనిపించ డం లేదని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంట ఆక్రమణలకు గురవుతున్నా ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదు అనేది తెలియాల్సి ఉంది.

అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపుతాము

కుంట, చెరువులు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. అప్పన్నకుంటలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నట్లు ఆదివారం తెలిసింది. వెంటనే రెవెన్యూ సిబ్బందితో కుంటలు అక్రమ నిర్మాణాలను నిలిపివేస్తాము. అప్పన్నకుంటలో ఆక్రమణకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.

దైవాదీనం, తహసీల్దార్‌, సుండుపల్లె

Updated Date - Sep 01 , 2024 | 11:31 PM