Share News

Balakrishna: టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు

ABN , Publish Date - Apr 19 , 2024 | 02:09 PM

టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదని హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ అన్నారు. హిందూపురంను ఏ విధంగా అభివృద్ధి చేశామో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న హిందూపురం అభివృద్ధి కోసం పని చేస్తున్నామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 20 నుంచి 30 సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు.

Balakrishna:  టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదు

శ్రీ సత్యసాయి: టీడీపీ - జనసేన - బీజేపీ కూటమిని తట్టుకునే శక్తి ఎవరికీ లేదని హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) అన్నారు. హిందూపురంను ఏ విధంగా అభివృద్ధి చేశామో ప్రజలు చూస్తూనే ఉన్నారన్నారు. ప్రతిపక్షంలో ఉన్న హిందూపురం అభివృద్ధి కోసం పని చేస్తున్నామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 20 నుంచి 30 సంవత్సరాలు రాష్ట్రం వెనుకబడిపోయిందన్నారు. విద్య వైద్యం అన్ని విషయాల్లోనూ నష్టం జరిగిందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పెట్టేందుకు చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని బాలకృష్ణ తెలిపారు.

Sharmila: కర్నూలు జిల్లాలో నేటి నుంచి షర్మిల న్యాయ యాత్ర


ఎన్టీఆర్ హయాంలోనే తూముకుంటలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేశామని బాలయ్య తెలిపారు. హిందూపురంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. టీడీపీ హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడానికి స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం సాయంత్రం హిందూపురానికి చేరుకున్నారు. ఈ సారి బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధరాదేవి కూడా ఆయనతో పాటు ఆయన సతీమణి డమ్మి అభ్యర్థిగా నామినేషన పత్రాలు అందజేయనున్నారు.

ఇవి కూడా చదవండి...

AP Elections: నిజంగా నిరుపేద.. బుట్టా

Laptop: రూ.17 వేలకే 8 జీబీ ర్యామ్ ల్యాప్‌టాప్.. అదిరిపోయే ఆఫర్

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 19 , 2024 | 02:09 PM