Beeda Ravichandra: బీసీలకు జరిగిన అన్యాయాన్ని లెక్కలతో వివరించిన బీద రవిచంద్ర
ABN , Publish Date - Jan 10 , 2024 | 08:14 AM
జగన్ ప్రభుత్వంలో బీసీలకి జరిగిన అన్యాయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర లెక్కలతో సహా వివరించారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. బీసీలకు జగన్ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 74మంది బీసీలు హత్యలకి గురయ్యారని తెలిపారు.
నెల్లూరు: జగన్ ప్రభుత్వంలో బీసీలకి జరిగిన అన్యాయాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర లెక్కలతో సహా వివరించారు. నేడు ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. బీసీలకు జగన్ ప్రభుత్వంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 74మంది బీసీలు హత్యలకి గురయ్యారని తెలిపారు. 5 వేల మందిపై దాడులు జరిగాయన్నారు.
బీసీల సంక్షేమానికి వినియోగిచాల్సిన రూ.76వేల కోట్ల నిధులని జగన్ దారి మళ్లించారని బీద రవిచంద్ర పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కి కోతపెట్డి రాజకీయంగా అణగదొక్కారన్నారు. 6వేల మంది పదవులు పొందే అవకాశం కోల్పోయారన్నారు. ఒక్క జిల్లాలోనూ బీసీ భవన్ నిర్మించలేక పోయారన్నారు. సామాజిక సాధికారిక పెరుతో మంత్రులు, ఎంపీలు బస్సుయాత్రలు నిర్వహించడం ఘోరమని బీద రవిచంద్ర పేర్కొన్నారు.