Share News

Satya Kumar: అవినీతి.. వైసీపీ నాయకుల రక్తంలో నరనరానా జీర్ణించుకపోయిన రక్కసి

ABN , Publish Date - Feb 28 , 2024 | 06:35 PM

రాయదుర్గంలోని జగనన్న కాలనీలో (Jaganna Colony) ఒక ఇల్లు గృహప్రవేశానికి ముందే కూలిపోయిన ఘటనపై జగన్ సర్కార్ మీద బీజేపీ (BJP) జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Satya Kumar) విమర్శలు గుప్పించారు. వైసీపీ వాళ్లకు అభివృద్ధి అంటే తెలిదయని, అభివృద్ధి చేయడమూ చేతకాదని, కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయంటూ మండిపడ్డారు.

Satya Kumar: అవినీతి.. వైసీపీ నాయకుల రక్తంలో నరనరానా జీర్ణించుకపోయిన రక్కసి

రాయదుర్గంలోని జగనన్న కాలనీలో (Jaganna Colony) ఒక ఇల్లు గృహప్రవేశానికి ముందే కూలిపోయిన ఘటనపై జగన్ సర్కార్ మీద బీజేపీ (BJP) జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (Satya Kumar) విమర్శలు గుప్పించారు. వైసీపీ వాళ్లకు అభివృద్ధి అంటే తెలిదయని, అభివృద్ధి చేయడమూ చేతకాదని, కానీ మాటలు మాత్రం కోటలు దాటుతాయంటూ మండిపడ్డారు. అలాగే.. వైసీపీ నాయకుల రక్తంలో అవినీతి (Corruption) అనేది నరనరానా జీర్ణించుకుపోయిన రక్కసి అంటూ దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా జగన్ ప్రభుత్వంపై (Jagan Govt) విరుచుకుపడ్డారు.


‘‘పనోడు పందిరి వేస్తే.. పిచ్చుకలు వచ్చి పడగొట్టాయని వెనకటికి ఒక సామెత ఉంది. సీఎం జగన్ (CM Jagan) ​ప్రభుత్వం చేపడుతున్న నాసిరకం తూతూ పనులను చూస్తుంటే ఇదే సామెత గుర్తొస్తోంది. గతంలో వైజాగ్‌లో బస్​బే నిర్మించగా అది ప్రారంభానికి ముందే కూలిపోయింది. వైజాగ్ బీచ్‌లో (Vizag Beach) నిన్న కాక మొన్న ఓపెన్​చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ (Floating Bridge) 24 గంటల్లోపే కొట్టుకుపోయింది. ఇప్పుడు రాయదుర్గం మల్లాపురంలోని జగనన్న కాలనీలో.. గృహప్రవేశానికి ముందే పేకమేడ ఇల్లు కూలిపోయింది. అభివృద్ధి అంటే తెలియదు, అభివృద్ధి చేయడం చేతకాదు, మాటలు మాత్రం కోటలు దాటుతాయ్. ఇది అభివృద్ధి కాదు, అవినీతి.. వైసీపీ నాయకుల రక్తంలో నరనరానా జీర్ణించుకపోయిన రక్కసి’’ అంటూ సత్యకుమార్ ట్వీట్ చేశారు. అలాగే.. ఇల్లు కూలిపోయిన ఘటనకు సంబంధించిన ఓ వార్తను ఈ ట్వీట్‌కు జత చేశారు.

ఇదిలావుండగా.. రాయదుర్గంలోని మల్లాపురంలో నివాసముంటున్న హేమజ్యోతి అనే మహిళకు జగనన్న కాలనీలో ఒక ఇల్లు మంజూరైంది. ఈ ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి రూ.1.80 లక్షలు అందాయి. ఈ ఇల్లు నిర్మాణ కాంట్రాక్ట్ పనుల్ని వైసీపీ కౌన్సిలర్ భర్త సత్యనారాయణ తీసుకున్నారు. ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్లులతో పాటు హేమజ్యోతి మరో రూ.1.30 లక్షలు చెల్లించింది. నిర్మాణం పూర్తవ్వడంతో.. మార్చి 1వ తేదీన గృహప్రవేశానికి ముహూర్తం ఖరారు చేశారు. అయితే.. ఇంతలోనే ఇంటి పైకప్పు కూలింది. దీంతో.. కాంట్రాక్టర్ నాసికరంగా ఇల్లు నిర్మించారంటూ హేమజ్యోతి ఆరోపించారు. అటు.. వైసీపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. కాగా.. కూలిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Updated Date - Feb 28 , 2024 | 06:35 PM