Share News

ఎన్డీఏ హయాంలోనే పోలవరం పూర్తి

ABN , Publish Date - Nov 20 , 2024 | 04:19 AM

ఎన్డీఏ ప్రభుత్వంలోనే పోలవరం పూర్తి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అన్నారు.

ఎన్డీఏ హయాంలోనే పోలవరం పూర్తి

  • విశాఖకు ఎంతో ఉపయోగం: విష్ణుకుమార్‌ రాజు

  • చింతలపూడి ఎత్తిపోతల పనులను ప్రారంభించాలి: గోరంట్ల

అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): ఎన్డీఏ ప్రభుత్వంలోనే పోలవరం పూర్తి చేస్తామని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు అన్నారు. మంగళవారం శాసన సభలో పోలవరంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. ‘2014-19లో అద్భుత పాలన అందించాం. పోలవరాన్ని కూడా 72 శాతం పూర్తి చేశాం. విధ్వంసానికి మారుపేరు జగన్‌. 17 నెలల పాటు పోలవరం పనులు నిలిపేశారు. సమయం, నిధులు వృథా అయ్యి తీవ్ర నష్టం జరిగిం ది. పోలవరం పూర్తి అయితే విశాఖపట్నానికి ఎంతో ఉపయోగం’ అని విష్ణుకుమార్‌ రాజు అన్నారు. జగన్‌ రైతు ద్రోహి అని చీఫ్‌ విప్‌ జి.వి.ఆంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ, ‘జగన్‌ ఐదేళ్ల కాలంలో పోలవరానికి పొగ, అమరావతికి అగ్గి పెట్టారు. తనువు తీరినా... తనివి తీరని వ్యక్తి జగన్‌’ అని విమర్శించారు. రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ.. ‘గత టీడీపీ ప్రభుత్వంలో రూ.1,000 కోట్లతో నిర్మించిన పట్టిసీమ వల్ల రూ.8 వేల కోట్ల ఆదాయం వచ్చింది. పోలవరం పూర్తి చేస్తే లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. దాని వల్ల రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు పెరుగుతుంది. పోలవరం ప్రాజెక్టు విషయం లో జగన్‌ చేసిన తప్పులకు ఆయన్ను జైలులో పెట్టాలి. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారు. వెంటనే పనులు ప్రారంభించాలి’ అని కోరారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం నిర్వాసితులను పట్టించుకోలేదని స్థానిక ఎమ్మెల్యే బాలరాజు అన్నారు. ఎమ్మెల్యేలు పుల్లారావు, కాలవ శ్రీనివాసులు, జయ నాగేశ్వరరెడ్డి తదితరులు మాట్లాడారు.

Updated Date - Nov 20 , 2024 | 04:19 AM