Share News

Bollineni Krishnaiah: శ్రీనివాస్ 'జయ జయ శత్రుభయంకర'తో మంత్రి ఆనంను అభినందించిన కృష్ణయ్య

ABN , Publish Date - Jun 17 , 2024 | 11:53 PM

మనస్సును ఎంత నిర్మలంగా ఉంచుకుంటే అంతగా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలను పవిత్రంగా చెయ్యగలుగుతామని, అలా మనస్సును పవిత్రస్థితి వైపు నడిపించే పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనాలు రెండింటిని ఆవిష్కరించే భాగ్యం కలిగించిన పరమాత్మకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

Bollineni Krishnaiah: శ్రీనివాస్ 'జయ జయ శత్రుభయంకర'తో మంత్రి ఆనంను అభినందించిన కృష్ణయ్య

నెల్లూరు: మనస్సును ఎంత నిర్మలంగా ఉంచుకుంటే అంతగా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలను పవిత్రంగా చెయ్యగలుగుతామని, అలా మనస్సును పవిత్రస్థితి వైపు నడిపించే పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనాలు రెండింటిని ఆవిష్కరించే భాగ్యం కలిగించిన పరమాత్మకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. దేవాదాయశాఖామంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించిన రామనారాయణరెడ్డి సోమవారం తమ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి , మునిసిపల్ శాఖామంత్రి పి. నారాయణతో కలిసి చారిత్రాత్మకమైన తల్పగిరి రంగనాథస్వామి దర్శనం చేసుకున్నారు.


Purana-Punda-02.jpg

ఈ సందర్భంగా ఆలయప్రాంగణంలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనలైన ' జయ జయ శత్రు భయంకర' , ' నమోనమస్తే ' గ్రంధాలను ఆనం రామనారాయణరెడ్డి ఆవిష్కరించి తొలి ప్రతులను పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఈ అపురూప గ్రంధాలకు సౌజన్యాన్ని అందించి ఆశీర్వదించిన కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ , మాజీ శాసన సభ్యులు బొల్లినేని కృష్ణయ్య సహృదయ సంస్కారానికి రామనారాయణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. హింసకు దూరంగా ఉండే కొద్దీ దైవత్వం మనల్ని అల్లుకుంటుందని , శ్రీనివాస్ గ్రంధాలద్వారా సాధన, సత్యాన్వేషణ, సౌందర్యారాధన, సంస్కారం బలంగా పాఠకుణ్ణి హత్తుకుంటాయని రామనారాయణరెడ్డి ప్రశంసించారు.


Purana-Punda-02-1st.jpg

ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖామంత్రిగా ఈ పవిత్ర గ్రంధాల ఆవిష్కరణతో వెలుగులవైపు రామనారాయణరెడ్డి తొలి అడుగు వెయ్యడం మంగళపరిణామమని మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలపడం విశేషం. అత్యంత ఆకర్షణీయంగా ఈ చక్కని ' జయ జయ శత్రు భయంకర' , ' నమోనమస్తే ' గ్రంధాలను నెల్లూరు భక్త జనానికి సమర్పించిన మాజీ శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్య పై ప్రశంసలు వెల్లువెత్తాయి. గత దశాబ్ద కాలంగా నెల్లూరు జిల్లా వాసులకు ఆనం రామ నారాయణ రెడ్డి సౌజన్యంతో ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ రచించి ప్రచురించే అపురూప గ్రంధాలు చిర పరిచితమే.


Purana-Punda-05.jpg

ఇక పోతే ... సుమారు పద్దెనిమిది సంవత్సరాలుగా పురాణపండ శ్రీనివాస్ అఖండ గ్రంధాలను సౌందర్యవంతమైన పేటికలుగా బొల్లినేని కృష్ణయ్య చెన్నై, హైదరాబాద్, నెల్లూరు, విశాఖపట్నం , విజయవాడ నగరాలలో వేల కొలదీ పరమార్ధ గ్రంధాలను వితరణ చేసి ఎన్నో సమాజాల ద్వారా అభినందనలందుకున్న అంశం మేధో సమాజానికీ , భక్త పాఠకులకూ ఎరుకే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, శ్రీమతి భువనేశ్వరి దంపతులకు దైవీయ ఆశీర్బలం అందాలనే గట్టి సంకల్పంతో ... దేవాదాయ శాఖామంత్రి రామనారాయణరెడ్డిని అభినందిస్తూ కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్ , మాజీ శాసనసభ్యులు బొల్లినేని కృష్ణయ్య చాలా చూడ చక్కని గ్రంథాలుగా ఈ దివ్య శోభల గ్రంధాలు రెండింటినీ ప్రచురించడం , నెల్లూరు వాసులకు సమర్పించడం పట్ల కృష్ణయ్య ధార్మిక సేవకు, శ్రీనివాస్ రచనా శైలికి జేజేలు పలుకుతున్నారు.


Purana-Punda-03.jpg

పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి , శాసన సభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా ఇలాంటి ఒక పవిత్రగ్రంధాన్ని నెల్లూరు ఆలయాలకు , భక్తకోటికి, తెలుగుదేశం పార్టీ కుటుంబ శ్రేణులకు బహూకరిస్తే బాగుంటుందని అక్కడ నేతలు కొందరు మాట్లాడుకోవడం కొసమెరుపుగా చెప్పక తప్పదు. పరిమళభరితమైన పదాలతో సౌందర్య గ్రంధాలను లక్షలకొలది ఆంధ్రులకు అందించిన నిస్వార్ధ ధార్మిక సేవకులు , శ్రీశైల దేవస్థానం సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ వేమిరెడ్డి కుటుంబీకుల భక్తి గ్రంధాన్ని కూడా భుజాలకెత్తుకుంటే నెల్లూరు భక్తులకు పాలసముద్రపు మీగడ భక్తి అందినట్లేనని రంగనాధ స్వామి ఆలయ అర్చకులు వ్యాఖ్యానించడం విశేషం. సోమవారం సాయంకాలమే చిన్న జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో శ్రీవైష్ణవ సాంప్రదాయంలో జరిగిన మరొక మహోన్నత ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొని చిన్నజీయర్ మంగళాశాసనాలు పొందడం విశేషం.

Updated Date - Jun 17 , 2024 | 11:58 PM