Home » Vemireddy Prabhakar Reddy
Manmohan singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ మంత్రులు, ఎంపీ సంతాపం తెలియజేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను కొత్త పుంతలు తొక్కించిన ఘనత మన్మోహన్ సింగ్ దే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.
జిల్లా అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అవమానం జరిగింది. స్వాగత కార్యక్రమంలో మంత్రులకు మాత్రమే అధికారులు బొకేలు అందజేశారు. ఈ వేదికపై ఎంపీ వేమిరెడ్డి ఉన్నప్పటికీ అధికారులు విస్మరించారు.
మనస్సును ఎంత నిర్మలంగా ఉంచుకుంటే అంతగా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలను పవిత్రంగా చెయ్యగలుగుతామని, అలా మనస్సును పవిత్రస్థితి వైపు నడిపించే పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనాలు రెండింటిని ఆవిష్కరించే భాగ్యం కలిగించిన పరమాత్మకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.
ఎంతో సౌజన్యమూర్తులైన వేమిరెడ్డి దంపతులు ఈ అనిర్వచనీయమైన ‘జయ జయోస్తు’ గ్రంధాన్ని కొందరికే ఇవ్వడంతో... అన్ని ఆలయాలవారూ నెల్లూరు జిల్లా అంతటా ఈ గ్రంధం కోసం ఎదురు చూస్తున్నారని... ఇందులో పురాణపండ శ్రీనివాస్ అంత వైదికమైన, ఆలయాలకు అవసరమైన మంచి కంటెంట్ అందించారని నెల్లూరు అర్చక పండితులు స్పష్టం చేస్తున్నారు.
నెల్లూరు: నగరంలోని మాగుంట లేఔట్ ఎస్ఆర్కె స్కూల్లో కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రకభాకర్ రెడ్ది దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వేమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని, భారీ మెజార్టీతో విజయం సాధించబోతున్నామని అన్నారు.
నెల్లూరు పార్లమెంట్లో వైసీపీకి పెట్టని కోటల్లా ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు బద్దలయ్యాయి. దీంతో టీడీపీ విజయావకాశాలు రోజు రోజుకు మెరుగుపడుతుండగా.. వైసీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారింది. నియోజకవర్గానికి పరిచయం అక్కర్లేని నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూటమి పక్షాన రంగంలోకి దిగగా.
కోవురు కేక పెట్టింది... వైసీపీకి దడపుట్టిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎక్కడికి పోయినా ఇదే జనం తమ సభలకు తరలి వస్తున్నారన్నారు. జగన్ పనైపోయిందని చెప్పారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుందన్నారు. అయితే వైయస్ జగన్ దోచుకోవాల్సింది దోచుకున్నానని.. దాచుకోవాల్సింది దాచుకున్నానని చేతులెత్తేశాడంటూ చంద్రబాబు వ్యంగ్యంగా అన్నారు.
Andhrapradesh: ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలో మొదటి నామినేషన్ దాఖలైంది. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి జిల్లాలో తొలి నామినేషన్ వేశారు. కోవూరు కూటమి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి రెండు సెట్లు నామినేషన్ దాఖలు చేశారు.
‘జయ జయోస్తు’ అద్భుత గ్రంధాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు, నెల్లూరు తెలుగుదేశం పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, ఆయన సతీమణి కోవూరు తెలుగుదేశం శాసన సభ అభ్యర్థి, టి.టి.డి. సలహామండలి చైర్ పర్సన్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు ఆవిష్కరించడంతో అపురూప భక్తి సేవకు మరొకసారి నెల్లూరులో తెరలేచినట్లైంది
నెల్లూరు: జిల్లాలో వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేందుకు మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్ రెడ్డి సిద్ధమయ్యారు. శుక్రవారం మరి కాసేపట్లో రాజీనామా ప్రకటన చేయునున్నట్లు సమాచారం.