Cantaloupe : సీతాఫలం - సాగులో సఫలం
ABN , Publish Date - Nov 22 , 2024 | 11:33 PM
సీతాఫ లం సీజన్ వస్తే అందరూ అడవుల్లో పండే ప్రకృతి సీతాఫలాలను తెచ్చుకుని లేదా కొనుగోలు చేసి తింటారు. అయితే ఈసీజన్ గ్రామీణ పేదలకు జీవనోపాధి. ఈసీజన్‌లో అడవులకు వెళ్లి సీతాఫ లం తెచ్చికుని మాగబెట్టి అమ్ముకుంటుంటారు. దీంతో ఆర్థికంగా కొంత ఊపిరి పీల్చుకుంటా రు.
పెద్దమండ్యం, నవంబరు 22(ఆంధ్రజ్యోతి): సీతాఫ లం సీజన్ వస్తే అందరూ అడవుల్లో పండే ప్రకృతి సీతాఫలాలను తెచ్చుకుని లేదా కొనుగోలు చేసి తింటారు. అయితే ఈసీజన్ గ్రామీణ పేదలకు జీవనోపాధి. ఈసీజన్‌లో అడవులకు వెళ్లి సీతాఫ లం తెచ్చికుని మాగబెట్టి అమ్ముకుంటుంటారు. దీంతో ఆర్థికంగా కొంత ఊపిరి పీల్చుకుంటా రు. మండల రైతు అబ్దుల్లా సీతాఫలం సాగు చేస్తూ లాభాల్లో పురోగతి సాధిస్తు న్నాడు. వివరాల్లో కెళితే...
పెద్దమండ్యం మండలం కలిచెర్లకు చెందిన అబ్దు ల్లా తన ఆరెకరా ల్లో సీతాఫలం తోట సాగు చేసి మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ఈ సీతా ఫలం మన ప్రాంతంలో తోటలు సాగు చేయడం విశేషం. దీంతో సీతా ఫలం సాగుపై మండల రైతుల దృష్టి మళ్లిం ది. సస్యర క్షణ శ్రమ తక్కువ, ఆదా యం ఎక్కువ తెచ్చే పంట సీతాఫలం తోటల సాగుపై రైతు పలు అంశాలు వెల్లడించారు. మూడేళ్ల కిందట సీతాఫ లం మొక్కలను మహరాష్ట్రలోని షోలాపూర్ నుంచి దిగుమతి చేసుకు న్నారు. ఎన్‌ఎంకే గోల్డ్‌న్ వెరైటీ సీతాఫలం ఎకరాకు 450 మొక్కలు, సాగుకు రూ. 2లక్షల నుంచి రూ. 2. 5 లక్షలు పెట్టుబడి పెట్టాలి.
ఎగుమతులకు సిద్ధంగా...
ఈ పంట సాగు చేస్తే రెండేళ్లలోనే దిగుబడులు వస్తాయి. సీతాఫ లం చెట్లు కాలపరిమితి 25 నుంచి 30 ఏళ్లు. తోట లు సాగు వ్యవసాయ సాగు పద్దతులు డ్రిప్ ఇరిగే షన్ ద్వారా పంట సాగుతో నీటి ఆదా జరుగుతుం దన్నారు. ఏటా నిఖర ఆదాయం వచ్చే పంటతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని వెల్లడించారు. ఎలాంటి భూముల్లో అయినా ఈ పంటలు సాగు చేయవచ్చు. ఈ ఫలం తినడం వల్ల కంటికి మం చింది. రక్తహీనత నివారిస్తుంది. శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయని వైద్య నిపుణులు చెపుతున్నా రు. సీతాఫలం నాణ్యత బట్టి మార్కెట్‌లో కిలో ధర రూ. 100 నుంచి రూ 120 పలుకుతోందన్నారు. మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపా రులు నేరుగా తోటల వద్దకు వచ్చి పంట దిగుబ డులు కొనుగోలు చేస్తున్నారు. సీతాఫలం తోటలు సాగు చేసుకోవడానికి మన రైతులు దృష్టి సారిస్తే లాభాలు పొందవచ్చని రైతు తెలిపారు.
మహానగరాల్లో మంచి డిమాండ్
హైదరాబాద్, ఢిల్లీ వంటి నగరాల్లో మన సీతాఫ లానికి మంచి డిమాండ్ ఉంది. మార్కెటింగ్ చేసుకోవడానికి అవగాహన అవసరం. సీతాఫ లం తోటలు సాగు చేసుకుంటే లాభ దాయక పంట. ఏటా నిఖర ఆదాయం వస్తుంది.
షేక్ అబ్దుల్లా, కలిచెర్ల రైతు, పెద్దమండ్యం మండలం