రామ్‌గోపాల్ వర్మపై కేసులు
ABN , Publish Date - Nov 12 , 2024 | 04:35 AM
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
మద్దిపాడు, తుళ్లూరు స్టేషన్లలో నమోదు
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టారని ఫిర్యాదు
ఒంగోలు క్రైం, తుళ్లూరు, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు, గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. వర్మ రూపొందించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, బ్రాహ్మణి, పవన్ కల్యాణ్ ఫొటోలను మార్ఫింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫొటోలు తమ నాయకుల వ్యక్తిత్వాల ను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండ ల టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు వర్మపై ఐటీ యాక్టు కింది కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్‌బాబు తెలిపారు. కాగా.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన రాంగోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతలపాటి రామారావు సోమవారం తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.