Share News

Elections 2024 : సీఎస్‌కు చంద్రబాబు లేఖ

ABN , Publish Date - Mar 31 , 2024 | 02:39 PM

ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీకి తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం లేఖ రాశారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Elections 2024 : సీఎస్‌కు చంద్రబాబు లేఖ

అమరావతి, మార్చి 31: ఆంధ్రప్రదేశ్‌లో పెన్షన్ల పంపిణీకి తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ( KS Jawajar reddy) కి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదివారం లేఖ రాశారు. వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీని నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. వృద్ధులు, వింతంతువులతోపాటు ఇతర లబ్దిదారులకు సైతం నగదు రూపంలో పెన్షన్ మొత్తం చెల్లించాలని సూచించారు. గ్రామ సచివాలయం ఉద్యోగులు, ఇతర క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా సకాలంలో, ఎటువంటి జాప్యం లేకుండా పెన్షన్ పంపిణీ జరిపేలా చూడాలన్నారు. అందుకోసం సచివాలయ సిబ్బంది పెన్షన్ మొత్తాన్ని బ్యాంకుల నుంచి తీసుకుని వెళ్లాడానికి అనుమతించాలని కోరారు. అందుకు అవసరం అయిన అన్నీ అనుమతులు ఇవ్వాలన్నారు.

మరోవైపు పెన్షన్ పంపిణీకి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదంటూ వార్తలు వెల్లువెత్తుతోన్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కారణంగా పెన్షన్ల పంపిణీకి అవసరమైన నిధులు వెంటనే అందుబాటులో ఉంచాలని ఉన్నతాధికారులను కోరారు.

గతంలో ఇచ్చిన విధంగానే ప్రతీ నెల 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్య పెన్షన్ల పంపిణీ ప్రక్రియ పూర్తి చేయడానికి అవరమైన యంత్రాంగాన్ని సమకూర్చడంతోపాటు నిధులను సైతం సిద్ధం చేయాలని సీఎస్‌కు చంద్రబాబు లేఖలో విజ్జప్తి చేశారు. ఇక రాష్ట్రంలో పెన్షన్ పంపిణీకి తగు చర్యలు తీసుకునేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవో మీనాకు చంద్రబాబు లేఖ ద్వారా విజ్జప్తి చేశారు.

మరిన్నీ ఏపీ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పింఛన్లు ఇవ్వలేకనే జగన్ కొత్త నాటకానికి తెర: ఎమ్మెల్యే అనగాని

సిక్కోలు జిల్లాలో పోటీ పడేది వీరే..!

Updated Date - Mar 31 , 2024 | 04:32 PM