Share News

AP Election Results: నాడు అలా.. నేడు ఇలా.. దేశం చూపు చంద్రబాబు వైపు..!?

ABN , Publish Date - Jun 04 , 2024 | 08:39 PM

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారనే ఓ చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది. ఆ క్రమంలో ఆయన కింగ్ మేకర్‌గా వ్యవహరించే అవకాశాలు సైతం ఉన్నాయని సదరు సర్కిల్‌లో వైరల్ అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. ఆ రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో సైతం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టించింది.

 AP Election Results: నాడు అలా.. నేడు ఇలా.. దేశం చూపు చంద్రబాబు వైపు..!?

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మళ్లీ కేంద్రంలో చక్రం తిప్పబోతున్నారనే ఓ చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో హల్‌చల్ చేస్తుంది. ఆ క్రమంలో ఆయన కింగ్ మేకర్‌గా వ్యవహరించే అవకాశాలు సైతం ఉన్నాయని సదరు సర్కిల్‌లో వైరల్ అవుతుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనే కాదు.. ఆ రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో సైతం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభంజనం సృష్టించింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని హస్తిన కేంద్రంగా జరిగే రాజకీయ పరిణామాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాత్ర అత్యంత కీలకం కానుందని రాజకీయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.


గతంలో సైతం ఎన్డీయేలో టీడీపీ కీలక భాగస్వామ్య పక్షంగా వ్యవహరించిందని ఈ సందర్భంగా ఆ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఆ క్రమంలో దేశ ప్రధానులుగా వాజపేయ్, హెచ్ డి దేవగౌడ, ఐకే గుజ్రాల్‌ ఎంపిక చేయడంలో ఎన్డీయే కన్వీనర్‌గా చంద్రబాబు అత్యంత కీలకంగా వ్యవహరించారని పేర్కొంటున్నాయి. అదే సమయంలో ఏపీ సీఎంగా ఉన్న నారా చంద్రబాబు నాయుడుకు... ప్రధాని పీఠం అధిష్టించే అవకాశం వెతుక్కుంటూ వచ్చిందని.. కానీ తనకు ఆంధ్రప్రదేశ్.. స్వర్ణాంధ్రప్రదేశ్ కల సాకారం అయితే చాలన్నారని గుర్తు చేస్తున్నాయి.


దీంతో ప్రధాని పీఠాన్ని ఆయన తృణప్రాయంగా వదులు కున్నారని పేర్కొంటున్నాయి. ఇక ఎన్డీయే తరఫున రాష్ట్రపతిగా భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాంను ఎంపిక చేయడంలో చంద్రబాబు తన మార్క్‌ రాజకీయాన్ని ప్రదర్శించారు. అయితే ఏపీజే అబ్దుల్ కలాం.. రాజకీయాలకు అతీతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాష్ట్రపతిగా తెరపైకి తీసుకు వచ్చి గెలిపించిన ఒకే ఒక్కడు ఈ నారా చంద్రబాబు నాయుడు అని స్పష్టం చేస్తున్నాయి.

ఇక అమలాపురం ఎంపీ, టీడీపీ నాయకుడు జీఎంసీ బాలయోగిని లోక్‌సభ స్పీకర్‌ అభ్యర్థిగా ఖరారు చేయడంలో సైతం చంద్రబాబు క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఆంధ్రప్రదేశ్‌లో కొలువు తిరింది. దీంతో భవిష్యత్తులో చంద్రబాబు సేవలను కేంద్రంలో ఏర్పాటు కానున్న ప్రభుత్వం ఉపయోగించు కుంటుందనడంలో ఎటువంటి సందేహం లేదని ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jun 04 , 2024 | 10:34 PM