CBN: చంద్రబాబు రాయలసీమ పర్యటన 31వ తేదీ షెడ్యూల్ ఖరారు..
ABN , Publish Date - Mar 30 , 2024 | 08:30 PM
టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ శ్రీకాళహస్తిలో పర్యటించిన బాబు.. 31వ తేదీన కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోఆయన పర్యటన సాగనుంది.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు రాయలసీమ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ శ్రీకాళహస్తిలో పర్యటించిన బాబు.. 31వ తేదీన కర్నూలు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లోఆయన పర్యటన సాగనుంది. ఇవాళ శ్రీకాళహస్తి ప్రజాగళం బహిరంగ సభలో బాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ లక్షల కోట్ల అప్పు ఏపీపై మోపారని బాబు ఆరోపించారు. రూ. 10 ఇచ్చి.. రూ100.. దోచే జలగ జగన్ అని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకం మెగాడీఎస్సీ పైనే ఉంటుందని తెలిపారు.
2029కి దేశంలోనే నెంబర్ వన్‌గా ఆంధ్రప్రదేశ్‌ని తయారు చేయడం తన విజన్ అని చంద్రబాబు చెప్పారు. తమది సంక్షేమమని.. జగన్‌ది సంక్షోభమని అన్నారు. గుడిని గుడిలోని లింగాన్ని మింగేలా జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కమీషన్లు కబ్జాలు రౌడీయిజం ఆదాయ వనరులుగా జగన్ మార్చుకున్నారని మండిపడ్డారు.
UP: యూపీలో ఘోరం.. పొలంలోకి మేక వెళ్లిందని దళిత మహిళపై దాష్టీకం
జనం జగన్ బెండు తీయడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు. జగన్ అహంకారి, విధ్వంసకారుడు, అవినీతిపరుడని చెప్పారు. తాను ఎంతో మందిని చూశానని.. ఇలాంటి వాళ్లంతా కాలగర్భంలో కలిసిపోయారని అన్నారు.