Chardham: భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రకు అంతరాయం
ABN , Publish Date - Sep 13 , 2024 | 09:52 AM
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. కేదార్‌నాథ్, బద్రీనాథ్ మార్గాల్లో కొండచరియలు జారిపడ్డాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ యాత్రికులు చిక్కుకుపోయాయి.
ఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. కేదార్‌నాథ్, బద్రీనాథ్ మార్గాల్లో కొండచరియలు జారిపడ్డాయి. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ యాత్రికులు చిక్కుకుపోయాయి. చిక్కుకున్నవారిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ఉన్నారు. ఇక భారీ వర్షాలు కారణంగా కేదార్‌నాథ్ యాత్రలో చిక్కుకున్న యాత్రీకుల్లో జిల్లాకు చెందిన నలుగురున్నారు. సున్నా డిగ్రీ చలి వాతావరణం, భోజనం కూడా లేక యాత్రికులు బాధపడుతున్నారు.
వృద్ధులు, పిల్లలు అయితే ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు. తమతో పాటు ఆంధ్రాకు చెందిన 20 మంది యాత్రీకులు ఉన్నారని జిల్లా వాసులు చెబుతున్నారు. ఈ రోజు ఉదయం ఆరు గంటలకు హెలీకాఫ్టర్ వస్తుందని చెప్పిన అధికారులు, వాతావరణం అనుకూలించకపోవటంతో మరో రెండు రోజులు ఎక్కడి వారు అక్కడే ఉండవలసి ఉందన్న అధికారుల సూచనతో యాత్రీకులు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర ఏవియేషన్ అధికారులతో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు సంప్రదింపులు జరుపుతున్నారు.
కేదారీనాథ్‌లో చిక్కుకున్న జిల్లాకు చెందిన నలుగురు, ఆంధ్రాలో మొత్తం 20 మందిని సురక్షితంగా తీసుకురావటానికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో మాట్లాడానని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. కేదారీనాథ్‌లో చిక్కుకున్న కొంత మంది యాత్రీకులకు ఆక్షిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నందు వలన వారు ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రత్యేక హెలీకాఫ్టర్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.. ఏవియేషన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు.