అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌గా
ABN , Publish Date - Nov 28 , 2024 | 05:01 AM
అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన చిలకలపూడి పాపారావు బుధవారం గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవనంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు
చిలకలపూడి బాధ్యతల స్వీకరణ
విజయవాడ వన్‌టౌన్, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): అగ్నికుల క్షత్రియ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన చిలకలపూడి పాపారావు బుధవారం గొల్లపూడిలోని బీసీ సంక్షేమ భవనంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర, ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ ఎంపీ మోపిదేవి వెంకటరమణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు మాట్లాడుతూ బీసీలకు గౌరవ ప్రదమైన జీవనం అందించటమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. బీసీ డిక్లరేషన్ అమలు చేయటానికి సీఎం కృతనిశ్చయంతో ఉన్నారని, తాజా బడ్జెట్‌లో బీసీ వెల్ఫేర్‌కు రూ.39 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. చైర్మన్ పాపారావు మాట్లాడుతూ తనను నమ్మి బాధ్యతలు అప్పగించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు జీవితాంతం రుణపడి ఉంటానన్నారు. బీసీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ ఏఎండీ రమాదేవి ప్రమాణ స్వీకారం చేయించారు.