Subha Muhurtham: కల్యాణ ఘడియలు.. వచ్చే రెండు నెలల్లో 18 శుభ ముహూర్తాలు
ABN , Publish Date - Oct 29 , 2024 | 12:50 PM
సుమారు ఏడాది తర్వాత అధిక సంఖ్యలో ముహూర్తాలు రావడంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. నవంబరు 12 నుంచి డిసెంబరు 16 వరకు సుమారు 18 ముహూర్తాలు ఉండడంతో తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఓ ఇంటివారిని చేసే పనిలో పడ్డారు.
- పురోహితుల నుంచి ఫొటోగ్రాఫర్ల దాకా పెరిగిన డిమాండ్
- చిత్తూరు, ఆంధ్రజ్యోతి
సుమారు ఏడాది తర్వాత అధిక సంఖ్యలో ముహూర్తాలు రావడంతో జిల్లాలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. నవంబరు 12 నుంచి డిసెంబరు 16 వరకు సుమారు 18 ముహూర్తాలు ఉండడంతో తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఓ ఇంటివారిని చేసే పనిలో పడ్డారు. పురోహితులకు, మంగళ వాయిద్యాల వారికి, వంట మనుషులకు, డెకరేషన్ చేసేవారికి, భజంత్రీల వారికి, ఫొటోగ్రాఫర్లకు, ఎలక్ర్టీషియన్స్‌కు, ఈవెంట్ మేనేజర్స్‌కు, బ్యూటీషియన్స్‌కు, షామియానా, వేదిక అలంకరణ, పూల దండలు, పండ్లు, కొబ్బరికాయలు, ఐస్‌క్రీం తదితర వృత్తిదారులకు చేతి నిండా పని దొరికిందనిచెప్పవచ్చు.
ఈ వార్తను కూడా చదవండి: AP News: దీపావళి ఎఫెక్ట్.. పూల ధరలకు రెక్కలు
- కళ్యాణ మండపాలకు పెరిగిన డిమాండ్
కళ్యాణ మండపాలకు డిమాండ్ బాగా పెరిగింది. నెల రోజుల ముందే బుక్ చేసుకుంటున్నారు. ఎక్కువమంది ఏసీ మండపాలే కోరుకుంటున్నారు. కొన్ని కళ్యాణమండపాల నిర్వాహకులు పెళ్లివారికి ఇబ్బంది లేకుండా ‘కేటరింగ్, డెకరేషన్, పురోహితులు, బ్యాండు, భోజనాలు’ ఏర్పాటుచేసి ప్యాకేజీ రూపంలో వసూలు చేస్తున్నారు. చిత్తూరు నగరం(Chittoor city)లో సుమారు 17 మండపాలున్నాయి.
వాటితో పాటు పెళ్ళిళ్లు నిర్వహించే 6 ఆలయాలున్నాయి. నవంబరు 12 నుంచి ఇవన్నీ బిజీ అయిపోయాయి. అలాగే పుంగనూరులో 12 మండపాలు, నగరిలో 10 మండపాలు, పలమనేరులో ఆరు మండపాలుండగా.. దాదాపు అన్నీ బుక్ అయిపోయాయి. మండపాల స్థాయిని బట్టి రూ.40 వేల నుంచి రూ.లక్షల వరకు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలవారు సమీప పట్టణాల్లోని చిన్న షాపుల్లో తాళి బొట్లు కొనుగోలు చేస్తుండగా, సంపన్నులు మాత్రం బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలకు వెళ్లి ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు.
- చిత్తూరులో నగరంలో ఇదీ పరిస్థితి
చిత్తూరు నగరంలో 17 మండపాలు, పెళ్లిళ్లు నిర్వహించే ఆరు ఆలయాలు ఉండగా.. నవంబరు 12 నుంచి డిసెంబరు 16 వరకు సుమారు 140 పెళ్లిళ్లు జరగనున్నాయి. కళ్యాణ మండపాలు దొరకని పరిస్థితిలో కొందరు ఆలయాల్లో పెళ్లి చేసుకునేందుకు ప్లాన్ చేసుకున్నారు.
- ముహుర్తాలివే
నవంబరులో 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, 29 తేదీలు. డిసెంబరులో 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీలు శుభప్రదమైన రోజులుగా పండితులు చెబుతున్నారు. ఆ తర్వాత సంక్రాంతి మూఢాలు వస్తే.. ఫిబ్రవరి, మార్చి నెల వరకు ముహూర్తాలకోసం ఆగాల్సిందే.
ఈవార్తను కూడా చదవండి: Food Poisoning: వామ్మో.. మోమోస్!
ఈవార్తను కూడా చదవండి: KTR: బుచ్చమ్మది.. రేవంత్ చేసిన హత్య
ఈవార్తను కూడా చదవండి: Madhuranagar: ‘ధరణి’తో మా ప్లాట్ల కబ్జా
ఈవార్తను కూడా చదవండి: Kaleshwaram Project: మేడిగడ్డతో ముంపు
Read Latest Telangana News and National News