దర్శన క్యూలో శునకం
ABN , Publish Date - Dec 04 , 2024 | 01:40 AM
తిరుమలలోని దర్శన క్యూలైన్‌లో మంగళవారం ఓ శునకం కూడా భక్తులతో కలిసి వెళుతూ కనిపించింది. సాధారణంగా తిరుమలలో స్థానికులూ శునకాలను పెంచకూడదు.
తిరుమలలోని దర్శన క్యూలైన్‌లో మంగళవారం ఓ శునకం కూడా భక్తులతో కలిసి వెళుతూ కనిపించింది. సాధారణంగా తిరుమలలో స్థానికులూ శునకాలను పెంచకూడదు. ఎక్కడైనా శునకాలు కనిపిస్తే వాటిని హెల్త్ విభాగం సిబ్బంది పట్టుకుని తిరుపతికి తరలించాలి. కొద్దిరోజులుగా తిరుమలలో పెంపుడు కుక్కలు అధికమయ్యాయి. శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులు, కాటేజీలు, బస్టాండు, లడ్డూకౌంటర్ వంటి ప్రాంతాలతో పాటు బాలాజీనగర్‌లోనూ కనిపిస్తున్నాయి. తాజాగా మంగళవారం ఓ శునకం ఏటీజీహెచ్ వద్దనున్న స్లాటెడ్ సర్వదర్శనం భక్తుల క్యూలైన్‌లో వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ ఇలా వీధి కుక్క క్యూలైన్‌లోకి రావడం ఏంటని భక్తులు విమర్శించారు.
- తిరుమల, ఆంధ్రజ్యోతి