drone's-ఇసుకాసురులపై డ్రోన్ కన్ను
ABN , Publish Date - Nov 29 , 2024 | 12:40 AM
ఇసుకాసురుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు అధికారులు డ్రోన్ కెమరాలను రంగంలోకి దించారు.గంగవరం మండల పరిధిలోని కౌండిన్య నది కాలువలో ఇసుకను విచ్చలవిడిగా తరలించేస్తున్నారని సమాచారం అందడంతో చిత్తూరు నుంచీ గంగవరానికి డ్రోన్ కెమరాలను పంపించారు.
- గంగవరంలో రెండు ఎక్స్‌కవేటర్ల గుర్తింపు
గంగవరం,నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఇసుకాసురుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు అధికారులు డ్రోన్ కెమరాలను రంగంలోకి దించారు.గంగవరం మండల పరిధిలోని కౌండిన్య నది కాలువలో ఇసుకను విచ్చలవిడిగా తరలించేస్తున్నారని సమాచారం అందడంతో చిత్తూరు నుంచీ గంగవరానికి డ్రోన్ కెమరాలను పంపించారు. వీటితో రెండు రోజుల నుంచి విస్తృత తనిఖీలు చేపట్టారు.కౌండిన్య నది కాలువలో ఇసుక తీస్తున్న ఎక్స్‌కవేటర్ డ్రోన్ కెమరాకు పట్టుబడడంతో పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఈ విషయమై తహశీల్దార్ శివకుమార్‌ను అడగ్గా నిబంధనల ప్రకారం కూలీలను పెట్టుకుని ఇసుకను ట్రాక్టర్లతో తరలించాలన్నారు.అలాకాకుండా ఎక్స్‌కవేటర్లు పెట్టి లారీల్లో ఇసుకను తరలించడానికి ప్రయత్నిస్తే వదిలే ప్రసక్తి లేదని హెచ్చరించారు.