Share News

miserable-ఒంటరి ఏనుగు బీభత్సం

ABN , Publish Date - Dec 05 , 2024 | 01:33 AM

బంగారుపాళ్యం మండలంలోని పొదలమడుగు పంచాయతీ సామచేను మిట్టవద్ద మంగళవారం రాత్రి ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం గుడియాత్తం-పలమనేరు రహదారిలోని బేరింగ్‌ చెరువు సమీపంలో అడ్డంగా నిలబడి ఘీంకారం చేసిన ఈ గజరాజు అటుగా వెళ్తున్న వాహనదారులు హారన్‌ మోగించినా కదల్లేదు.

miserable-ఒంటరి ఏనుగు బీభత్సం
ధ్వంసమైన గుడిసె

బంగారుపాళ్యం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి):బంగారుపాళ్యం మండలంలోని పొదలమడుగు పంచాయతీ సామచేను మిట్టవద్ద మంగళవారం రాత్రి ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. మంగళవారం సాయంత్రం గుడియాత్తం-పలమనేరు రహదారిలోని బేరింగ్‌ చెరువు సమీపంలో అడ్డంగా నిలబడి ఘీంకారం చేసిన ఈ గజరాజు అటుగా వెళ్తున్న వాహనదారులు హారన్‌ మోగించినా కదల్లేదు. అర్ధగంట సేపు రోడ్డుపైనే వుండి తరువాత పక్కనే ఉన్న బేరింగ్‌ చెరువు వైపు వెళ్లింది.అర్ధరాత్రి దాటాక సామచేను సమీపంలోని చెక్‌పోస్టు వద్దకు చేరిన ఒంటరి ఏనుగు పక్కనే ఓ పూరిగుడిసెను ధ్వంసం చేసింది. ఆ ఇంటిలో నిద్రిస్తున్న సరోజమ్మ భయంతో పరుగులు తీసింది. ఇంటిలోని బియ్యంతో పాటు సామగ్రిని ఏనుగు ధ్వంసం చేసింది. గమనించిన గ్రామస్థులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని డప్పులు వాయించి ఏనుగును కొండవైపు అటవీ ప్రాంతానికి దారి మళ్లించారు.

Updated Date - Dec 05 , 2024 | 01:33 AM