Share News

గురుకుల చదువులపై ‘సమ్మె’ట

ABN , Publish Date - Dec 19 , 2024 | 01:56 AM

గిరిజన గురుకులాల్లో (రెసిడెన్షియల్‌ స్కూల్స్‌) కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు నెలరోజులుగా చేస్తున్న సమ్మె విద్యార్థుల చదువులను ప్రభావితం చేస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం గిరిజన వసతి గృహాలను రెసిడెన్షియల్‌ స్కూళ్లుగా మార్చింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెగ్యులర్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని నియమించలేదు. మౌలిక వసతులపైనా దృష్టి సారించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు తమ డిమాండ్లతో గతనెల 16 నుంచి సమ్మెకు దిగారు.

గురుకుల చదువులపై ‘సమ్మె’ట
ఆన్‌లైన్‌లో విద్యాబోధన చేస్తున్న ప్రిన్సిపాల్‌

ప్రిన్సిపాళ్లతో నడుస్తున్న విద్యాలయాలు

సిలబ్‌సలో విద్యార్థుల వెనుకబాటు

పుంగనూరు, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : గిరిజన గురుకులాల్లో (రెసిడెన్షియల్‌ స్కూల్స్‌) కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు నెలరోజులుగా చేస్తున్న సమ్మె విద్యార్థుల చదువులను ప్రభావితం చేస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం గిరిజన వసతి గృహాలను రెసిడెన్షియల్‌ స్కూళ్లుగా మార్చింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెగ్యులర్‌ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని నియమించలేదు. మౌలిక వసతులపైనా దృష్టి సారించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాంట్రాక్ట్‌ ఉపాధ్యాయులు తమ డిమాండ్లతో గతనెల 16 నుంచి సమ్మెకు దిగారు.గిరిజన గురుకులాల్లో చిత్తూరులో 195మంది బాలికలు , పుంగనూరులో 128మంది బాలికలు,బంగారుపాళ్యంలో 115మంది బాలురు, రామకుప్పంలో 115మంది బాలురు ఉన్నారు.గతంలో ఒక్కో గురుకులానికి ప్రిన్సిపాల్‌, ఎనిమిదిమంది ఉపాధ్యాయులు, జూనియర్‌ అసిస్టెంట్‌, ఏఎన్‌ఎం, అటెండర్‌ పోస్టులను మంజూరు చేశారు.కానీ అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పుంగనూరు గురుకులంలో ఎనిమిది మంది ఉపాధ్యాయులకు గానూ ముగ్గురున్నారు. వారిలో ఒకరు లీవుపై వెళ్లగా మరో ఇద్దరు సమ్మెలో ఉన్నారు. ప్రిన్సిపాళ్ల చొరవతో 10వ తరగతి విద్యార్థులకు మాత్రం ఆన్‌లైన్‌లో విద్యాబోధన జరుగుతోంది. ఆన్‌లైన్‌ క్లాసులు పెట్టడానికి కూడా సిబ్బంది లేరు. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేసేవారూ లేరు. బాలికల గురుకులాల్లో రాత్రి కాపలాదారులు లేరు.భోజనశాల, నిద్రపోవడానికి వసతి కల్పించలేదు. పగలు తరగతి గదులనే రాత్రి నిద్రకు విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారు. మిగిలిన ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల్లో విద్యాబోధన సక్రమంగా జరుగుతోంది. పదవ తరగతి పరీక్షలకు ప్రభుత్వం తేదీలు ప్రకటించిన క్రమంలో ఇక్కడి విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. బాలికల గురుకులంలో ఎనిమిది పోస్టులకు తెలుగు, మ్యాథ్స్‌ సబ్జెక్టులకు కాంట్రాక్ట్‌ టీచర్లుండగా మరో టీచర్‌ సెలవుపై వెళ్లారు. మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చాలీచాలని ఉపాధ్యాయులతో క్లాసులను నిర్వహించడం కష్టంగా మారింది. ఈ విషయమై జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి మూర్తి మాట్లాడుతూ ప్రిన్సిపాల్‌ ద్వారా ఐఎఫ్పీ ఫ్యాడ్స్‌ ద్వారా కొంతమేర విద్యాబోధన జరుగుతోందన్నారు. ప్రతి గురుకులానికీ ఇద్దరు ఉపాధ్యాయులు ప్రకాశం జిల్లా నుంచి డిప్యుటేషన్‌పై వస్తున్నారన్నారు. తాత్కాలికంగా ఒక్కో ఉపాధ్యాయుడిని కేటాయించడానికి జిల్లా విద్యాశాఖ, మున్సిపల్‌ అధికారులు అంగీకరించారన్నారు. త్వరలోనే డిప్యుటేషన్‌పై ఉపాధ్యాయులు వస్తారన్నారు.

Updated Date - Dec 19 , 2024 | 01:56 AM