sea సముద్రంలో ‘అల’జడి
ABN , Publish Date - Sep 02 , 2024 | 01:44 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోట మండలం శ్రీనివాససత్రం, గోవిందపల్లిపాళెం సముద్రతీరంలో తహసీల్దారు జయజయరావు రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
కోట, సెప్టెంబరు 1: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కోట మండలం శ్రీనివాససత్రం, గోవిందపల్లిపాళెం సముద్రతీరంలో తహసీల్దారు జయజయరావు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కోటలోని తహసీల్దారు కార్యాలయంలో ఆదివారం కంట్రోల్ రూము ఏర్పాటు చేసి, సముద్ర తీరప్రాంతంలోని గ్రామాలపై నిఘా ఉంచారు. పంచాయతీల వారీగా అధికారులతో కమిటీలు వేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వాయుగుండం ప్రభావం వల్ల సముద్రం వెంబడి ఈదురుగాలులు, వర్షపుజల్లులు కురుస్తున్నాయి. సముద్రంలో అలల ఉధృతి పెరుగుతుండటంతో మత్స్యకారులు కూడా చేపల వేట నిలిపేశారు.