డీఆర్వో బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Oct 31 , 2024 | 01:47 AM
జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా నరసింహులు బుధవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
తిరుపతి(కలెక్టరేట్), అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో)గా నరసింహులు బుధవారం కలెక్టరేట్‌లో బాధ్యతలు చేపట్టారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తూర్పు గోదావరి జిల్లా డీఆర్వోగా పనిచేస్తూ బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇక్కడ ఉన్న పెంచలకిషోర్‌ను రాష్ట్ర ప్రభుత్వం జేఏడీలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించింది. నరసింహులు మాట్లాడుతూ జిల్లాలో భూ సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. గతంలో తిరుపతి ఆర్డీవోగా పని చేశానని, ఆ అనుభవంతో అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.