Adda to the druggists- డ్రగ్గిస్టులకు అడ్డా టూరిజం బిల్డింగ్
ABN , Publish Date - Dec 05 , 2024 | 02:06 AM
తిరుపతిలోని ఎస్వీఆర్ రుయా ఆస్పత్రికి ఎదురుగా అసంపూర్తి నిర్మాణంగా మిగిలిపోయిన టూరిజం భవనం డ్రగ్గిస్టులు, గంజాయి బ్యాచ్‌లకు అడ్డాగా మారుతోంది. గత పదేళ్లుగా ఇది మొండిగోడలకే పరిమితం అయ్యింది. నిర్మాణం పూర్తయి గదులు, గదులుగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అనువైన వేదికగా మారింది.
తిరుపతిలోని ఎస్వీఆర్ రుయా ఆస్పత్రికి ఎదురుగా అసంపూర్తి నిర్మాణంగా మిగిలిపోయిన టూరిజం భవనం డ్రగ్గిస్టులు, గంజాయి బ్యాచ్‌లకు అడ్డాగా మారుతోంది. గత పదేళ్లుగా ఇది మొండిగోడలకే పరిమితం అయ్యింది. నిర్మాణం పూర్తయి గదులు, గదులుగా ఉండడంతో అసాంఘిక కార్యకలాపాలకు అనువైన వేదికగా మారింది. గంజాయి, డ్రగ్స్‌కి అలవాటు పడినవారు అక్కడకి చేరిపోతున్నారు. పోలీసుల నిఘా లేకపోవడం వీరికి వరంగా మారింది. రెండు రోజుల కిందట అటువైపునుంచి మత్తులో తూలుతూ బైక్‌పై వచ్చిన ముగ్గురు తమ వాహనంతో మరో బైక్‌ను ఢీకొట్టారు. ఈఘటనలో రిటైర్డ్ అధికారి డాక్టర్ ఎన్.ధర్మయ్యకు తొడ ఎముక విరిగి తీవ్ర గాయాలయ్యాయి. ఆయనవెంట ఉన్న సాహితీవేత్త సాకం నాగరాజు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బాధితుల ఫిర్యాదుమేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మెడికల్ కాలేజీకి సమీపంలో ఉన్న ఈ భవనం ప్రమాద సంకేతంగా కనిపిస్తోంది.
- తిరుపతి, ఆంధ్రజ్యోతి