ఆనందమానందమాయె
ABN , Publish Date - Dec 04 , 2024 | 01:38 AM
ఇక్కడ పుట్టి, పెరిగి స్వామినే నమ్ముకుని జీవిస్తున్న మాకు ప్రత్యేక గౌరవానిచ్చేలా దర్శనాన్ని కల్పించిన టీటీడీకి రుణపడి ఉంటామంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
శ్రీవారి దర్శనంపై స్థానికుల హర్షాతిరేకం
తిరుమల, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఇక్కడ పుట్టి, పెరిగి స్వామినే నమ్ముకుని జీవిస్తున్న మాకు ప్రత్యేక గౌరవానిచ్చేలా దర్శనాన్ని కల్పించిన టీటీడీకి రుణపడి ఉంటామంటూ స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. తిరుమల, తిరుపతి రూరల్, అర్బన్, చంద్రగిరి, రేణిగుంట మండలాల ప్రజలకు సోమవారం ఉదయం తిరుపతిలో 2,500, తిరుమలలో 403 టోకెన్లు జారీ చేశారు. మంగళవారం ఉదయం 4 గంటల స్లాట్ నుంచి సాయంత్రం 6 గంటల స్లాట్ వరకున్న టోకెన్లతో వీరు శ్రీవారిని దర్శించుకున్నారు. దివ్యదర్శన క్యూలో వెళ్లిన వీరికి ఇతర భక్తులకులాగే ఓ లడ్డూను ఉచితంగా అందజేశారు.
53 నిమిషాల్లోనే దర్శనం
మేము 53 నిమిషాల్లోనే క్యూలైన్‌లోకి వెళ్లి దర్శనం పూర్తిచేసుకుని బయటకు వచ్చేశాం. ఇంత త్వరగా దర్శనం అయిపోతుందనుకోలేదు. లోపల కూడా మమల్ని నెట్టలేదు. మంచి దర్శనం దొరికింది. చాలా ఆనందంగా ఉంది.
- సుమతి
ప్రభుత్వం, టీటీడీ రుణం తీర్చుకోలేం
స్థానికులకు ప్రత్యేక దర్శనాన్ని కల్పించిన ప్రభుత్వం, టీటీడీ రుణం తీర్చుకోలేం. ఈ దర్శనాన్ని మళ్లీ తిరిగి ప్రారంభిస్తారనుకోలేదు. స్వామిని దర్శించుకునే అవకాశం కల్పించిన అధికారులకు, సిబ్బందికి ధన్యవాదాలు.
- గీత
స్థానికులుగా గర్వపడుతున్నాం
మాకు ప్రత్యేక గుర్తింపునిచ్చి స్థానికుల దర్శన కోటాలో దర్శనం చేయించడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఇచ్చిన ఈ గౌరవానికి గర్వపడుతున్నాం. సుపథం నుంచి స్థానికులను అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
- శ్రీదేవి
సిబ్బంది దురుసుతనం
స్లాట్ కంటే ముందుగా వచ్చామని సిబ్బంది అనుమతిచకపోగా దురుసుగా మాట్లాడుతున్నారు. స్థానికులను ఇతర భక్తులతో కలిపి అనుమతిస్తున్నారు. ప్రత్యేకంగా పంపాలని కోరుతున్నాం.
- శ్రీనివాసమూర్తి