Share News

road repairs-రోడ్ల మరమ్మతులకు మరో రూ.15.21 కోట్లు

ABN , Publish Date - Dec 05 , 2024 | 01:24 AM

వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం రెండో విడత కింద రూ.15.21 కోట్లను మంజూరు చేసింది.వైసీపీ ప్రభుత్వం కొత్త రహదారుల్ని వేయడం అటుంచితే, పాత వాటికి నిర్వహణ కూడా చేపట్టలేదు. ఈ క్రమంలో పాడైన రహదారుల మరమ్మతుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది.

road repairs-రోడ్ల మరమ్మతులకు మరో రూ.15.21 కోట్లు
బంగారుపాళ్యం మండలంలోని బండ్లదొడ్డి- కీరమంద రోడ్డు మరమ్మతు పనులు

రూ.6.72 కోట్లతో ఇప్పటికే పనులు ప్రారంభం

మొత్తం 1709 కి.మీ రహదారులకు మరమ్మతులు

చిత్తూరు,డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన రహదారుల మరమ్మతులకు ప్రభుత్వం రెండో విడత కింద రూ.15.21 కోట్లను మంజూరు చేసింది.వైసీపీ ప్రభుత్వం కొత్త రహదారుల్ని వేయడం అటుంచితే, పాత వాటికి నిర్వహణ కూడా చేపట్టలేదు. ఈ క్రమంలో పాడైన రహదారుల మరమ్మతుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. జిల్లాలో 1709 కిలోమీటర్ల రహదారులు చిధ్రమయ్యాయని గుర్తించి.. తొలి విడతలో రూ.6.72 కోట్ల నిధుల్ని కేటాయించింది. నవంబరు 2వ తేదీన 482 కిలోమీటర్ల తొలి విడత పనులు ప్రారంభమయ్యాయి. అప్పుడే రెండో విడత కింద రూ.15.21 కోట్లతో ప్రతిపాదనలు పంపగా.. ఆ నిధులు మంజూరయ్యాయి. త్వరలో ఈ పనుల్ని కూడా ప్రారంభించనున్నారు.

- జిల్లాలో మొత్తం ఆర్‌అండ్‌బీ రోడ్లు: 2436 కి.మీ

- దెబ్బతిన్న రహదారులు: 1709 కి.మీ

- తొలి విడత నిధుల కేటాయింపు: రూ.6.72 కోట్లు/ 482 కి.మీ

- రెండో విడత నిధులు: రూ.15.21 కోట్లు/ 1227 కి.మీ

ఫ రెండు విడతల్లో రూ.22 కోట్లతో పనులు

జిల్లాలో దెబ్బతిన్న రహదారుల్ని రెండు విడతల్లో మరమ్మతు చేయనున్నారు. ఈ రెండు విడతల పనులనూ సంక్రాంతిలోగా పూర్తి చేసేలా పనులు ప్రారంభించారు. తొలి విడతలో రూ.6.72 కోట్లతో 482 కిలోమీటర్లు, రెండో విడతలో రూ.15.21 కోట్లతో 1227 కిలోమీటర్ల రహదారుల్ని బాగు చేస్తున్నారు. తొలి విడత పనులు ప్రారంభమవ్వగా.. రెండో విడత పనులకు టెండర్లు పిలిచారు.

నియోజకవర్గం దెబ్బతిన్న రోడ్డు (కి.మీ) కేటాయించిన నిధులు

కుప్పం 547.119 రూ.363.35లక్షలు

పూతలపట్టు 266.58 రూ.312.9లక్షలు

పలమనేరు 223.97 రూ.199.7లక్షలు

చిత్తూరు 116.665 రూ.294.15లక్షలు

జీడీనెల్లూరు 300.972 రూ.447.95లక్షలు

నగరి 147.021 రూ.316.15లక్షలు

పుంగనూరు 107.449 రూ.259.65లక్షలు

మొత్తం 1709.776 రూ.2193.85లక్షలు

Updated Date - Dec 05 , 2024 | 01:24 AM