పరిశ్రమల్ని ప్రోత్సహించేలా అడుగులు
ABN , Publish Date - Dec 03 , 2024 | 02:26 AM
గత ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిని పట్టించుకోని విషయం తెలిసిందే. జిల్లాకు వచ్చిన పరిశ్రమలు కూడా వైసీపీ అధికారంలోకి రాగానే రద్దు చేసుకుని వెళ్లిపోయాయి. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు.
- జిల్లాలో ప్రారంభమైన ఎంఎ్‌సఎంఈ సర్వే
గత ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధిని పట్టించుకోని విషయం తెలిసిందే. జిల్లాకు వచ్చిన పరిశ్రమలు కూడా వైసీపీ అధికారంలోకి రాగానే రద్దు చేసుకుని వెళ్లిపోయాయి. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా పరిశ్రమల్ని ప్రోత్సహించేందుకు తీవ్రంగా కృషి చేస్తుంటారు. 2014-19 మధ్యలో కూడా ఉమ్మడి జిల్లాలోని శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు ప్రాంతాల్లో భారీ పరిశ్రమల్ని నెలకొల్పారు. కుప్పం, పలమనేరు, పుంగనూరు, జీడీనెల్లూరు ప్రాంతాల్లో ఎంఎ్‌సఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) పార్కుల్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు కూటమి అధికారంలో వచ్చాక కేంద్ర ప్రభుత్వ సహకారంతో పరిశ్రమల అభివృద్ధిపై దృష్టి సారించింది. ఎంఎ్‌సఎంఈలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
- చిత్తూరు, ఆంధ్రజ్యోతి
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని మెరుగు పరిచేందుకు ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో కేంద్ర ప్రభుత్వం ర్యాంప్ అనే స్కీమ్‌ను ప్రకటించింది. ఇందులో ఓ భాగమైన ఎంఎ్‌సఎంఈ ఫార్మలైజేషన్‌లో భాగంగా రాష్ట్రంలో అన్ని ఎంఎ్‌సఎంఈల సర్వే చేస్తున్నారు. ఈ క్రమంలో మన జిల్లాలో కూడా గత శుక్రవారం నుంచి సర్వే ప్రారంభమైంది. ఎంఎ్‌సఎంఈ సర్వే అండ్ సపోర్ట్ అనే మొబైల్ యాప్‌లో సచివాలయ సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. నవంబరు 29న ప్రారంభమైన ఈ సర్వే ఫిబ్రవరి ఒకటో తేదీవరకు కొనసాగుతుంది. తయారీ, సేవ, వాణిజ్య రంగాల్లోని అన్ని ఎంఎ్‌సఎంఈ యూనిట్లను సర్వే చేసి.. వాటిని డిజిటల్ ప్లాట్‌ఫాంలోకి తీసుకొచ్చి ‘ఏపీ.ఎంఎ్‌సఎంఈ.వన్’ అనే పోర్టల్‌లో ఉంచుతారు. అలాగే నమోదుకాని వ్యాపారాలను ఉద్యమ్, ఉద్యమ్ అసి్‌స్టలలో నమోదు చేస్తారు.
సర్వేలో గుర్తిస్తే ఉపయోగాలెన్నో..
పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి ఎన్‌డీఏ ప్రభుత్వం 88 రకాల రాయితీలు అందిస్తోంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలున్నా చాలామంది అందుకోలేకపోతున్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లడంతో ఎంఎ్‌సఎంఈ సర్వేకు ఆదేశాలు జారీ చేసింది. సర్వే పూర్తయిన వారికి ఉద్యమ్ గుర్తింపు సంఖ్య వస్తుంది. ఈ రిజిస్ర్టేషన్ పత్రం వస్తే బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియ వేగవంతం అవుతుంది. రాయితీలు, సౌకర్యాలు పొందేందుకు అర్హత లభిస్తుంది. కేంద్రం రాయితీలు, మార్కెటింగ్, ఈ- కామర్స్ ద్వారా వ్యాపారాలు విస్తరించుకునే వెసులుబాటు కలుగుతుంది. ఓపెన్ నెట్‌వర్క్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ (ఓఎన్‌డీపీ) సహకారం అందిస్తారు. ఎంఎ్‌సఎంఈలు తాము ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు మల్టీనేషనల్ కంపెనీలతో అనుసంధానం చేస్తారు.
రెండ్రోజుల్లోనే 316 యూనిట్ల గుర్తింపు
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తోపుడు బండ్లు, మొబైల్ క్యాంటీన్ల ద్వారా వ్యాపారాలు చేసుకునేవారితోపాటు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నింటినీ సర్వే చేయనున్నారు. ఈ బాధ్యతను గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. శుక్ర, శనివారాలు చేసిన సర్వేలో అత్యధికంగా పలమనేరులో 79, పుంగనూరులో 65, శాంతిపురంలో 53 ఎంఎ్‌సఎంఈ యూనిట్లను గుర్తించారు. జిల్లావ్యాప్తంగా 316 యూనిట్ల వివరాలను నమోదు చేశారు.
ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు
ఈ సర్వేలో నమోదైన పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టు ద్వారా ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.కోటి పైబడి రుణాలు అందుతాయి. అలాగే ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (పీఎంఈజీపీ) ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాయితీ ఇస్తుండగా.. ప్రస్తుతం ఓసీలకు రాయితీ ఇవ్వనున్నారు. పట్టణ ప్రాంతాల్లో 15, గ్రామీణ ప్రాంతాల్లో 25 శాతం రాయితీ అందించనుంది. స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ముద్ర రుణాలు రూ.5-10 లక్షల వరకు ఇవ్వనున్నారు.
వివరాలిలా..
- ఉద్యమ్ పోర్టల్‌లో రిజిస్ర్టేషన్స్ అయినవి: 34,700
- పవర్ కనెక్షన్స్ ఉన్నవి: 67,296
- ఎంఎ్‌సఎంఈ మ్యానుఫ్యాక్చురింగ్ యూనిట్స్: 903
- రెండ్రోజుల్లో సర్వే చేసిన యూనిట్లు: 316
రాయితీలకు ఇదే ప్రామాణికం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల్ని గుర్తించేందుకు సర్వే మొదలుపెట్టాం. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోల పర్యవేక్షణలో సచివాలయ సిబ్బంది సర్వే చేస్తున్నారు. ఎనీ ఇమ్మూవబుల్ ఎకనమిక్ యూనిట్లను సర్వే చేయవచ్చు. సర్వేలో గుర్తించబడి పొందిన ఉద్యమ్ ధ్రువీకరణ పత్రాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలు, పథకాల్లో ప్రామాణికంగా తీసుకుంటారు.
- శ్రీనివా్‌సయాదవ్, జీఎం, జిల్లా పరిశ్రమల కేంద్రం