Share News

స్ర్టాంగ్‌ రూముల వద్ద అప్రమత్తంగా ఉండాలి

ABN , Publish Date - May 18 , 2024 | 12:47 AM

ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్ర్టాంగ్‌ రూముల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మణికంఠ చందోలు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన ఎస్వీసెట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని స్ర్టాంగ్‌ రూములను శుక్రవారం ఆయన పరిశీలించారు.

స్ర్టాంగ్‌ రూముల వద్ద అప్రమత్తంగా ఉండాలి
సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న ఎస్పీ మణికంఠ చందోలు

చిత్తూరు, మే 17: ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తయ్యే వరకు స్ర్టాంగ్‌ రూముల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మణికంఠ చందోలు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ఏడు అసెంబ్లీ, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన ఎస్వీసెట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలోని స్ర్టాంగ్‌ రూములను శుక్రవారం ఆయన పరిశీలించారు. అక్కడ విఽధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. పొరబాట్లకు తావివ్వకుండా పనిచేయాలన్నారు. ఏఎస్పీ అరీఫుల్లా, ట్రైనీ డీఎస్పీ పావన్‌కుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ మహబూబ్‌బాషా, ఎస్‌బీ సీఐ మనోహర్‌, ఆర్‌ఐలు నీలకంఠేశ్వర్‌రెడ్డి ఆయన వెంట ఉన్నారు.

Updated Date - May 18 , 2024 | 12:47 AM