పెచ్చులూడుతున్నాయ్ జాగ్రత్త
ABN , Publish Date - Dec 30 , 2024 | 01:32 AM
శ్రీహరి బస్టాండు భవనం శిథిలావస్థకు చేరుకుందని, రక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు.
- సీబీఎస్ అధికారులకు ఆర్టీసీ ఈడీ ఆదేశం
తిరుపతి(ఆర్టీసీ), డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): శ్రీహరి బస్టాండు భవనం శిథిలావస్థకు చేరుకుందని, రక్షణ చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన సెంట్రల్ బస్సు స్టేషన్‌లో పర్యటించారు. శ్రీహరి బస్టాండులో ప్రమాదం పొంచి ఉన్న స్థలాలను ఎంపిక చేసి, బ్లాక్ చేశారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు. నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ బస్టాండు గురించి అధికారులతో చర్చించారు. డీపీటీవో జగదీష్, బస్టాండు ఏటీఎం డీఆర్ నాయుడు, డీఈ చెన్నకేశవులు, ఈఈ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.