Share News

రాయలచెరువులో నేటి నుంచి పడవ పోటీలు

ABN , Publish Date - Dec 26 , 2024 | 01:36 AM

రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువులో గురువారం నుంచి డ్రాగన్‌ బోట్‌ (పడవ) పోటీలు ప్రారంభంకానున్నాయి. శాప్‌, ఏపీ కెనాయింగ్‌, కయాకింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలు జనవరి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి.

రాయలచెరువులో నేటి నుంచి పడవ పోటీలు

తిరుపతి(క్రీడలు), డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువులో గురువారం నుంచి డ్రాగన్‌ బోట్‌ (పడవ) పోటీలు ప్రారంభంకానున్నాయి. శాప్‌, ఏపీ కెనాయింగ్‌, కయాకింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలు జనవరి 9వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఇందులో ప్రతిభ చూపిన వారిని వచ్చేనెల 3నుంచి 6వరకు ఢిల్లీలో సీనియర్‌.. 11నుంచి 16వరకు కేరళలో జరిగే జూనియర్‌ 13వ నేషనల్‌ డ్రాగన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపిక చేయనున్నారు. తొలిసారిగా ఇక్కడ జరిగే ఈ పోటీలకు విజయవాడ, వైజాగ్‌, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల నుంచి ఇప్పటికే దాదాపు 50మంది పేర్లు నమోదు చేసుకున్నారు. రెండు బోట్లలో 12మంది చొప్పున ఉంటారు. వెయ్యి మీటర్ల పొడవును వేగంగా చేధించిన వారిని గుర్తిస్తారు. ఇలా పలుమార్లు పోటీలు ఏర్పాటుచేసి చివరగా ప్రతిభావంతంగా రాణించిన క్రీడాకారులను ఎంపిక చేసి జాతీయ స్థాయి పోటీలకు పంపుతారు.

Updated Date - Dec 26 , 2024 | 01:36 AM