Share News

Chidvilasa-చిన్నశేషుడిపై చిద్విలాసంగా..

ABN , Publish Date - Nov 29 , 2024 | 01:51 AM

కార్తీక బ్రహ్మోత్సవాల తొలిరోజున వేకువజామునే పద్మావతీ దేవికి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు.

 Chidvilasa-చిన్నశేషుడిపై చిద్విలాసంగా..

కార్తీక బ్రహ్మోత్సవాల తొలిరోజున వేకువజామునే పద్మావతీ దేవికి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆస్థాన మండపంలో సాయంత్రం 6 గంటలకు వేడుకగా ఊంజల్‌ సేవ జరిగింది. అనంతరం అమ్మవారిని వాహన మండపానికి తీసుకొచ్చి చిన్నశేష వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర, వజ్రవైడూర్య ఆభరణాలతో దివ్య మంగళ స్వరూపిణిగా చిన్న శేషుడిపై రాజసంతో తిరుమాడవీధుల్లో రాత్రి ఏడు గంటలకు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు.

Updated Date - Nov 29 , 2024 | 01:51 AM