Share News

CM relief fund-నలుగురికి సీఎం సహాయనిధి

ABN , Publish Date - Nov 29 , 2024 | 01:46 AM

ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నలుగురికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద సీఎం చంద్రబాబు గురువారం రాత్రి చెక్కులు అందించారు. వాయల్పాడు మండలానికి చెందిన జె.కుసుమకుమారి కుమార్తె మానస(13) అంకుర హాస్పిటల్‌లో ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్స పొందుతున్న వీడియో ముఖ్యమంత్రికి పంపడంతో ఆయన చలించిపోయారు.

CM relief fund-నలుగురికి సీఎం సహాయనిధి

ఫ చెక్కులు అందజేసిన చంద్రబాబు

చంద్రగిరి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న నలుగురికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద సీఎం చంద్రబాబు గురువారం రాత్రి చెక్కులు అందించారు. వాయల్పాడు మండలానికి చెందిన జె.కుసుమకుమారి కుమార్తె మానస(13) అంకుర హాస్పిటల్‌లో ఊపిరితిత్తుల వ్యాధితో చికిత్స పొందుతున్న వీడియో ముఖ్యమంత్రికి పంపడంతో ఆయన చలించిపోయారు. వారికి సీఎం సహాయనిధి నుంచి రూ.ఐదు లక్షల చెక్కు అందజేశారు. చంద్రగిరి మండలం శేషాపురానికి చెందిన పొదిలి శారద కుమారుడు హర్షవర్ధన్‌ బాబు 19 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో వారికి ఆర్థికంగా మూడు లక్షల చెక్కు ఇచ్చారు. తిరుపతి రూరల్‌కు చెందిన ఆర్‌ నాగరాజు తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, తన తల్లి కిడ్నీ సమస్యతో బాధపడుతోందని ఆర్థిక సహాయం కోరడంతో వారికి రూ.రెండు లక్షల చెక్కును అందజేశారు.

Updated Date - Nov 29 , 2024 | 01:46 AM