వరసిద్ధుడి ఆలయంలో రద్దీ
ABN , Publish Date - Aug 11 , 2024 | 02:02 AM
కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామి దర్శనానికి ఉదయం నుంచి వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేశారు.
ఐరాల(కాణిపాకం), ఆగస్టు 10: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. స్వామి దర్శనానికి ఉదయం నుంచి వేలాదిగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. క్యూలన్నీ పూర్తిగా నిండిపోయాయి. దర్శనానికి సుమారు మూడు గంటల సమయం పట్టింది. క్యూలలో భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు.