సీఆర్‌ఎ్‌సలో సిలిండర్ పేలుడు
ABN , Publish Date - Feb 13 , 2024 | 12:49 AM
రేణిగుంట సమీపంలోని రైల్వే క్యారేజ్ రిపేరుషాపు(సీఆర్‌ఎ్‌స)లో శనివారం రాత్రి 8.30గంటలకు ఓ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది.
రేణిగుంట, ఫిబ్రవరి12:రేణిగుంట సమీపంలోని రైల్వే క్యారేజ్ రిపేరుషాపు(సీఆర్‌ఎ్‌స)లో శనివారం రాత్రి 8.30గంటలకు ఓ గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. సీఆర్‌ఎ్‌సలో సాధారణంగా శనివారం మధ్యాహ్నం నుంచి కార్మికులకు సెలవు.తిరిగి సోమవారం ఉదయం మాత్రమే పనులు ప్రారంభమవు తాయి.అయితే రైలుపెట్టెల మరమ్మతులు ఎక్కువ చేశామని గుర్తింపు తెచ్చుకోవడానికి అధికారులు రాత్రివరకు కాంట్రాక్టు కార్మికుల చేత పనులు చేయించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అదృష్టవశాత్తూ కోచ్ బాడీ రిపేరు (సీబీఆర్ షాపు)లో సిలిండర్ పేలినప్పుడు లోపల ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదని తెలిసింది. విధుల్లో భాగంగా సోమవారం లోనికి వెళ్ళిన కార్మికులు సిలిండర్ పేలిందని గుర్తించి భయబ్రాంతులకు గురయ్యారు.గతంలో సిలిండర్ పేలి ఓ కార్మికుడు మృతి చెందిన సంఘటనను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.ఈ సంఘటనపై సీఆర్‌ఎస్ ఛీఫ్ వర్క్‌షాపు మేనేజరు దేవసహాయాన్ని వివరణ కోరగా ప్రమాదం ఎలా జరిగిందన్న విషయమై దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.