government employees ప్రభుత్వ ఉద్యోగులకు ‘చీకటి రోజు’
ABN , Publish Date - Sep 02 , 2024 | 02:24 AM
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) అమల్లోకి వచ్చిన సెప్టెంబరు ఒకటో తేదీని చీకటి రోజుగా పరిగణిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు.
సీపీఎస్ అమల్లోకి వచ్చిన రోజును పురస్కరించుకుని నిరసన
చిత్తూరు (సెంట్రల్), సెప్టెంబరు 1: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) అమల్లోకి వచ్చిన సెప్టెంబరు ఒకటో తేదీని చీకటి రోజుగా పరిగణిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు ఆదివారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. సీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సమీర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ విధానం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (పీసీఎ్‌స)గా మారిన సెప్టెంబర్ ఒకటో తేదీ ఉద్యోగులకు దుర్దినంగా పేర్కొన్నారు. దీనిద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ విరమణ తర్వాత తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. సీపీఎస్ రద్దుపై ఉద్యమాల నేపథ్యంలో జీపీఎ్‌సగా, ఆపై ఎన్‌పీఎ్‌సగా, తాజాగా యూపీఎ్‌సగా పేర్లు మార్చి ఉద్యోగులకు నష్టాన్ని కలిగిస్తున్నారన్నారు. వీటన్నింటిని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. సంఘం ప్రధాన కార్యదర్శి నరసింహులు, ఉపాధ్యక్షుడు లోకేష్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి : ఎస్టీయూ
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరుతూ ఎస్టీయూ నాయకులు ఆదివారం కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మదన్మోహన్, మోహన్ యాదవ్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సీపీఎస్ విధానానికి యూపీఎస్ అనే ముసుగు వేసి అమలు చేయాలని అనుకోవడం సరికాదన్నారు. పాత పెన్షన్ విధానం అమలు చేసి న్యాయం చేయాలని కోరారు. ఎస్టీయూ రాష్ట్ర నాయకులు గంటా మోహన్, పురుషోత్తం, జనార్దన్, జిల్లా నాయకులు రమణారెడ్డి, యువరాజు, చంద్రన్, చిట్టిబాబు పాల్గొన్నారు.