Home » Employees
అనవసర ఖర్చులు తగ్గించేందుకు బడ్జెట్లో కోతలు విధించడమే ప్రథమ లక్ష్యమని ప్రకటించిన అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చేందుకు కసరత్తు మొదలైంది.
విధి నిర్వహణలో ఉన్న వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర అధికారుల మీద జరిగిన దాడికి నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చింది.
చిన్న తప్పులకే తమను ఉద్యోగం నుంచి తొలగించారని, సీఎం రేవంత్ కల్పించుకుని తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులు, కార్మికులు విజ్ఞప్తి చేశారు.
కేంద్ర ప్రభుత్వం త్వరలో వేతన జీవులకు శుభవార్త చెప్పనుందా? ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వోలో) పరిమితిని రూ.15 వేల నుంచి రూ.21 వేలకు పెంచనుందా? ఈ ప్రశ్నలకు విశ్వసనీయవర్గాలు ఔననే చెబుతున్నట్లు జాతీయ వార్తాసంస్థలు కథనాలను ప్రచురించాయి.
పని చేసే చోట సహోద్యోగి వేధింపులు, యాజమాన్యం దురుసు మాటలకు మనస్తాపంతో ఓ మహిళా ఉద్యోగి ఆత్మహత్య చేసుకుంది.
పెండింగ్లో ఉన్న బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. తహసీల్దార్లకు అద్దె వాహనాల బకాయిలు రెండేళ్లుగా చెల్లించడంలేదని, ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్, లోక్సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగుల పారితోషకం, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, ఉద్యోగుల సరెండర్ లీవ్స్ బిల్లులు చెల్లించడంలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ, అనుబంధ శాఖల్లో రైతు సేవా కేంద్రాల సిబ్బంది క్రమబద్ధీకరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వైసీపీ హయాంలో రైతు భరోసా కేంద్రం సిబ్బంది నియామకం అస్తవ్యస్తంగా సాగింది. ఆర్బీకే సిబ్బంది విధులు నిర్వర్తించేది ఒక శాఖలో.. నియంత్రణ మరో శాఖలో ఉండంతో గందరగోళం కొనసాగుతోంది. ఆర్బీకే సిబ్బంది వేతనం, సెలవుల మంజూరు బాధ్యతలను పంచాయతీ సెక్రటరీలకు అప్పగించారు. పనులు మాత్రం వ్యవసాయ, ఉద్యాన, సిరికల్చర్ శాఖల్లో ...
ప్రాణాపాయ స్థితిలో ఉండేవారిని కాపాడటంలో కీలకంగా వ్యవహరిస్తున్న 108తోపాటు.. గ్రామీణ ప్రజల వద్దకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న 104 సిబ్బంది ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాలుగు నెలల నుంచి వీరికి వేతనాలు అందడం లేదు. వచ్చేది తక్కువ వేతనం. అదీ నెలనెలా అందడం లేదు. తాజాగా నిర్వహణ బాధ్యతల నుంచి అరబిందో సంస్థ తప్పుకోవడంతో బకాయి వేతనాలు వస్తాయో ...
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దీపావళి కానుకగా.. ఒక కరువు భత్యాన్ని/ కరువు సహాయాన్ని (డీఏ/డీఆర్) ప్రకటించింది.
ఇక నుంచి ప్రభుత్వ శాఖల్లో పనిచేసేవారంతా తమ అధికార ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ఫర్మెటిక్స్ సెంటర్ (ఎన్ఐసీ) ఈ-మెయిల్ ద్వారానే చేయాల్సి ఉంటుంది.