టెన్త్ జవాబు పత్రాల డీకోడింగ్ ప్రారంభం
ABN , Publish Date - Mar 22 , 2024 | 01:11 AM
టెన్త్ పరీక్షలు జరుగుతున్న తరుణంలోనే ఇతర జిల్లాల నుంచి మన జిల్లా కేంద్రానికి వచ్చిన జవాబు పత్రాలను స్థానిక పీసీఆర్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు.
చిత్తూరు (సెంట్రల్), మార్చి 21: టెన్త్ పరీక్షలు జరుగుతున్న తరుణంలోనే ఇతర జిల్లాల నుంచి మన జిల్లా కేంద్రానికి వచ్చిన జవాబు పత్రాలను స్థానిక పీసీఆర్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. పరీక్షల సహాయ కమిషనర్ చాముండేశ్వరి ఆధ్వర్యంలో గురువారం సిబ్బందికి సమావేశం నిర్వహించి, జవాబు పత్రాల డీకోడింగ్‌పై సూచనలు చేశారు. అనంతరం డీకోడింగ్ ప్రక్రియ ప్రారంభమైంది.