Share News

Demand of Rs ఎస్‌ఎ్‌సడీ సంస్థ పేరుతో రూ.5లక్షల డిమాండ్‌

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:26 AM

సమతా సైనిక్‌ దళ్‌(ఎ్‌సఎ్‌సడీ) సంస్థ పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ రూ.5లక్షలు డిమాండ్‌ చేస్తున్నారంటూ డీఎంహెచ్‌వో శ్రీహరి శుక్రవారం ఎస్పీ సుబ్బరాయుడికి ఫిర్యాదు చేశారు.

Demand of Rs ఎస్‌ఎ్‌సడీ సంస్థ పేరుతో రూ.5లక్షల డిమాండ్‌

తిరుపతి(వైద్యం), జూలై 26: సమతా సైనిక్‌ దళ్‌(ఎ్‌సఎ్‌సడీ) సంస్థ పేరుతో బెదిరింపులకు గురి చేస్తూ రూ.5లక్షలు డిమాండ్‌ చేస్తున్నారంటూ డీఎంహెచ్‌వో శ్రీహరి శుక్రవారం ఎస్పీ సుబ్బరాయుడికి ఫిర్యాదు చేశారు. కొంతకాలంగా కల్యాణ్‌, సుబ్రహ్మణ్యం, నాగేంద్రలు ఎస్‌ఎ్‌సడీ సంస్థ పేరుతో తనను నగదు డిమాండ్‌ చేయడంతోపాటు ఇవ్వకుంటే తప్పుడు ప్రచారాలకు తెరలేపుతామని బెదిరిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా నేరుగా ఇంటికే వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా ఎస్పీకి అందజేసినట్లు శ్రీహరి తెలిపారు.

ఫిర్యాదు చేసినందుకు కేసు పెట్టారు

వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా వైద్యాధికారి శ్రీహరిపై సమతా సైనికదళ్‌ సంస్థ తరఫున కలెక్టర్‌కు, హెల్త్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినందుకు తనపై అక్రమ కేసులు పెడుతున్నారని, సమతా సైనికదళ్‌ జిల్లా కార్యదర్శి గండికోట సుబ్రమణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తాము డీఎంహెచ్‌వోను ఎలాంటి నగదు డిమాండ్‌ చేయలేదని పేర్కొన్నారు.

Updated Date - Jul 27 , 2024 | 08:30 AM