Share News

Develop-ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయండి

ABN , Publish Date - Nov 29 , 2024 | 01:48 AM

చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట నుంచి మూలపల్లె వరకు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు.

Develop-ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయండి

గ్రామస్తులు, అధికారులతో సీఎం సమీక్ష

చంద్రగిరి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): చంద్రగిరి మండలంలోని ఎ.రంగంపేట నుంచి మూలపల్లె వరకు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి తన స్వగృహంలో అధికారులు, నారావారిపల్లె పరిసర గ్రామాల వారితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి సోలార్‌ ఏర్పాటు చేయాలన్నారు. ఎ.రంగంపేటలోని ఉన్నత పాఠశాలను మరింత అభివృద్ధి చేయాలన్నారు. నారావారిపల్లెలోని ప్రభుత్వ భవనాల్లో స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లుగా ఏర్పాటు చేసి, ఉపాధి కల్పనకు శ్రీసిటీకి అనుసంధానం చేయాలన్నారు. అదేవిధంగా గ్రామస్తులు మూలపల్లెలో హంద్రీనీవా నీటి ప్రాజెక్టు గత ప్రభుత్వంలో నిలిచిపోయిందని, ఆ ప్రాజెక్టు పూర్తయితే చెరువుల అనుసంధానం చేయడం వలన చంద్రగిరి మండలం సస్యశ్యామలం అవుతుందని గ్రామస్తులు తెలిపారు. ప్రధానంగా రైతులు పంటలు పండించలేకపోతున్నామని, శేషాచలం అడవుల నుంచి కోతుల బెడద అధికంగా ఉందని తెలపడంతో.. తగు చర్యలు చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతి రైతుకు ప్రతి నెల రూ.15 వేల రూపాయల ఆదాయం వచ్చేలా రూపకల్పన చేయాలని గ్రామస్తులు కోరారు. దీంతో వ్యవసాయ ఆధారిత పంటలు లాభదాయకంగా వచ్చేలా అధికారులు ప్రణాళికలు సిద్దం చేయాలన్నారు. ఆయా గ్రామస్తులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌, డీపీవో సుశీలాదేవి, తిరుపతి కార్పొరేషన్‌ కమిషనర్‌ మౌర్య, ఎమ్మెల్యే పులివర్తి నాని, టీడీపీ మండలాధ్యక్షుడు సుబ్రమణ్యంనాయుడు, గ్రామస్తులు గిరినాయుడు, వెంకటపతినాయుడు, నిరంజన్‌నాయుడు, పాశం చంద్రకుమార్‌నాయుడు, నారా సుబ్రమణ్యంనాయుడు, రాకే్‌షచౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 29 , 2024 | 01:48 AM