ఎర్రచందనం స్మగ్లింగులో తండ్రీకొడుకులకు ఐదేళ్ల జైలు
ABN , Publish Date - Nov 14 , 2024 | 02:05 AM
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన తండ్రీ కొడుకులకు ఎర్రచందనం కేసులప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6లక్షల జరిమానా విదించారు.
రేణిగుంట/మంగళం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ పట్టుబడిన తండ్రీ కొడుకులకు ఎర్రచందనం కేసులప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నరసింహమూర్తి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.6లక్షల జరిమానా విదించారు. ఈ మేరకు టాస్క్‌ఫోర్సు అధికారులు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. రేణిగుంట మండలం కరకంబాడి బీటు కృష్ణాపురం సెక్షన్‌లో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తూ అన్నమయ్య జిల్లా పెనగలూరు మండలం సిరివరం గ్రామానికి చెందిన తండ్రి తోట చిన్న చెంగయ్య, కుమారుడు చెంగయ్య పట్టుబడినట్లు పేర్కొన్నారు. వీరిద్దరిపై 2019 2022 సంవత్సరాల్లో కేసులను నమోదు చేశామన్నారు. ఇంత కాలంగా కొనసాగుతున్న విచారణలో వీరిని దోషులుగా గుర్తించి ఆర్‌ఎ్‌సఎస్ ఏడీజే న్యాయస్థాన న్యాయమూర్తి నరసింహమూర్తి తండ్రీ కొడుకులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బుధవారం తీర్పు చెప్పారన్నారు. శిక్ష పడిన వారిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించినట్లు టాస్క్‌ఫోర్స్ డీఎస్పీ బాలిరెడ్డి తెలిపారు. ఈ తీర్పు ఎర్రచందనం స్మగ్లర్లకు ఒక హెచ్చరికగా పనిచేస్తుందన్నారు.