Share News

విషజ్వరాలతో విలవిల

ABN , Publish Date - Nov 20 , 2024 | 01:43 AM

చిత్తూరు జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకూ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రితో పాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, , ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 285 డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వీరి గణాంకాల్లో చేరనివి ఇంతకు పదింతలుంటాయని అంచనా.

విషజ్వరాలతో విలవిల
చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఓపీ వద్ద రద్దీ

చిత్తూరు రూరల్‌, నవంబరు 19(ఆంధ్రజ్యోతి) :జిల్లాలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. రోజురోజుకూ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రితో పాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, , ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి.ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 285 డెంగ్యూ కేసులు నమోదైనట్లు వైద్యఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే వీరి గణాంకాల్లో చేరనివి ఇంతకు పదింతలుంటాయని అంచనా.

చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి సాధారణంగా రోజుకు 1500మంది ఓపీకి వస్తుంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3వేలకు చేరుతోంది.వీరిలో జ్వరంతో వచ్చే వారి సంఖ్య సగానికి పైగానే వుంటోంది. ఉదయం 9 గంటల నుంచే ఓపీ విభాగం కిక్కిరిసిపోతోంది.జనరల్‌ మెడిసిన్‌ విభాగం జ్వర బాధితులతో నిండిపోతోంది.ఇక్కడ డెంగ్యూ నిర్ధారణకు నిర్వహించే ఎలిసా టెస్టు ఫలితాలకు మూడు రోజులు పడుతోందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరిద్దరు వస్తే పరీక్షలు చేయడం లేదు.10మంది వుంటేనే ఎలిసా పరీక్షలు చేస్తుండడంతో రూ.వెయ్యికి పైగా చెల్లించి చాలామంది ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించుకుంటున్నారు.నిజానికి ఈ ర్యాపిడ్‌ టె్‌స్టలో ఖచ్చితత్వం ఉండడం లేదన్న కారణంతో మూడేళ్ల క్రితం ఆ పరీక్ష చేయవద్దని వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాలిచ్చింది. అయినప్పటికీ ప్రైవేటు ల్యాబుల్లో ఈ పరీక్షలకు రూ.600 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు.

ఫఆస్పత్రుల్లో ఖర్చు తడిసి మోపెడు

డెంగ్యూ జ్వరానికి సకాలంలో వైద్యం చేయించుకుంటే ప్రమాదం వుండదు. ఇది సోకితే రోగి శరీరంలో ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గడం సహజం. మరీ తగ్గితే తప్ప ప్లేట్‌లెట్లు ఎక్కించాల్సిన అవసరం ఉండదు.అయితే దీనిపై అవగాహన లేక ఎంతోమంది భయంతో ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరుతున్నారు. అక్కడ రక్తపరీక్షలు, బెడ్‌ ఛార్జీలు, మందులు అంతా కలిపి రూ.20 నుంచి 30 వేలు ఖర్చువుతుండడంతో పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు..

మందులన్నీ అందుబాటులో వుంచాం

వర్షాకాలం తర్వాత వాతావరణ మార్పులు సర్వసాధారణం.కాలువల్లో, తొట్టెల్లో, గుంతల్లో నీటి నిల్వతో దోమలు చేరి వ్యాధులకు కారణమవుతున్నాయి.ఈ కారణంగానే వైరల్‌ ఫీవర్లు వస్తుంటాయి. ప్రతి గ్రామంలో ఫీవర్‌ సర్వేలు నిర్వహించి, జ్వరపీడితులను విలేజ్‌ హెల్త్‌ క్లీనిక్కులకు తీసుకెళ్లి డెంగ్యూ, మలేరియా పరీక్షలు నిర్వహిస్తాం.విషజ్వరమని నిర్ధారణ అయితే పీహెచ్‌సీకి రెఫర్‌ చేసి సీబీసీ చేయించి దానికి తగ్గట్టుగా వైద్యం అందిస్తున్నాం. అందుకు అసరమైన వైద్యులు, మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు కూడా జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి వైద్యుడిని సంప్రదించాలి.

-డీఎంహెచ్‌వో ప్రభావతిదేవి

జిల్లాలో నమోదైన డెంగ్యూ, మలేరియా కేసులు

-----------------------------------------------------------------------------

సంవత్సరం డెంగ్యూ మలేరియా

---------------------------------------------------------------------------------------------------

2019 327 8

2020 25 3

2021 213 4

2022 179 2

2023 235 2

2024నవంబరు 19వరకు 285 2

Updated Date - Nov 20 , 2024 | 01:43 AM