Share News

పాపవినాశనం వద్ద అడవిలో మంటలు

ABN , Publish Date - Apr 23 , 2024 | 12:46 AM

పాపవినాశనం సమీపంలోని అడవిలో మంగళవారం మంటలు ఎగసిపడ్డాయి.

పాపవినాశనం వద్ద అడవిలో మంటలు

తిరుమల, ఏప్రిల్‌22(ఆంధ్రజ్యోతి): తిరుమలలో సందర్శనీయ ప్రదేశమైన పాపవినాశనం సమీపంలోని అడవిలో మంగళవారం మంటలు ఎగసిపడ్డాయి. వారం రోజులుగా శేషాచల అడవులు అగ్నికి ఆహుతవుతున్న విషయం తెలిసిందే. మామండూరు ప్రాంతంలోని అడవిలో మొదలైన మంటలు క్రమంగా తిరుమలకు సమీపం వరకు వచ్చాయి. శుక్రవారం ఏకంగా తిరుమలలోని పార్వేటమండపానికి సమీపంలోని శ్రీగంధవనం వరకు మంటలు వ్యాపించాయి.ఈ క్రమంలో టీటీడీ, ప్రభుత్వ ఫారెస్ట్‌ అధికారులు మంటలు వ్యాప్తిచెందకుండా చర్యలు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది.శనివారం మంటలు ఆగిపోయాయను కున్నప్పటికీ ఆదివారం రాత్రి నుంచి మళ్లీ అడవిలో మంటలు కనిపించాయి. సోమవారం పాపవినాశనం సమీపానికి వచ్చిన మంటలు భారీగా ఎగసిపడ్డాయి.జనసంచారం దిశగా మంటలు రాకుండా అధికారులు ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - Apr 23 , 2024 | 12:46 AM