Share News

టీటీడీ బోర్డు సభ్యులతో ప్రత్యేక కమిటీల ఏర్పాటు

ABN , Publish Date - Dec 29 , 2024 | 02:21 AM

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు.

టీటీడీ బోర్డు సభ్యులతో ప్రత్యేక కమిటీల ఏర్పాటు

తిరుమల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులతో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. 16 కమిటీల సభ్యుల వివరాలను శనివారం జేఈవో వీరబ్రహ్మం వెల్లడిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఫైనాన్స్‌ కమిటీలో జాస్తి పూర్ణసాంబశివరావు,కృష్ణమూర్తి వైద్యనాథన్‌, సుచిత్ర ఎల్లా, ఏఫ్‌ఏ అండ్‌ సీఏవో(కన్వీనర్‌), కొనుగోళ్ల కమిటీలో జ్యోతుల నెహ్రు, సదాశివరావు, ఆర్‌ఎన్‌ దర్శన్‌, జీఎం ప్రొక్యూర్మెంట్‌(కన్వీనర్‌), ఇంజనీరింగ్‌ కమిటీలో రాజశేఖర గౌడ్‌, శాంతారాం, ఆనందసాయి, చీఫ్‌ ఇంజనీర్‌(కన్వీనర్‌), ఎస్టేట్‌ కమిటీలో జ్యోతుల నెహ్రు, జంగా కృష్ణమూర్తి, రంగసాయి, ఎస్టేట్‌ ఆఫీసర్‌ తిరుపతి(కన్వీనర్‌)గా ఉంటారు. అప్పీల్స్‌ కమిటీలో ఆర్‌ఎన్‌ దర్శన్‌,నరే్‌షకుమార్‌,అదిత్‌దేశాయ్‌, ఎండోమెంట్‌ కమిషనర్‌, డీఏ సెక్షన్‌ డిప్యూటీఈవో (కన్వీనర్‌), ఎడ్యుకేషన్‌ కమిటీలో ఎంఎస్‌ రాజు, పనబాక లక్ష్మి, భానుప్రకా్‌షరెడ్డి, డీఈవో(కన్వీనర్‌), మెడికల్‌ కమిటీలో నర్సిరెడ్డి, మునికోటేశ్వరరావు, సౌరభ్‌బోరా, చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌(కన్వీనర్‌)గా ఉంటారు. అలాగే హెచ్‌డీపీపీ, స్విమ్స్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌, స్విమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు, బర్ట్‌ ట్రస్టు, ఎస్వీబీసీ బోర్డు, ఆర్ట్స్‌ కాలేజీ, ఎస్‌జీఎస్‌ కాలేజీ, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ, పీజీ కాలేజీ, న్యూఢిల్లీ ఎస్వీ కాలేజీలకు గవర్నింగ్‌ బాడీలకు సభ్యులను నియమించారు.

Updated Date - Dec 29 , 2024 | 02:21 AM