Share News

కన్నులపండువగా వినాయక కల్యాణం

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:08 AM

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కార్తీక బహుళ శుద్ధ పంచమి వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు.అలంకార మండపం వద్ద సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవర్లకు అర్చకులు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు.

కన్నులపండువగా వినాయక కల్యాణం
వధూవరులకు హారతి

ఐరాల(కాణిపాకం), నవంబరు 20(ఆంధ్రజ్యోతి): కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో కార్తీక బహుళ శుద్ధ పంచమి వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు.అలంకార మండపం వద్ద సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయకస్వామి ఉత్సవర్లకు అర్చకులు పంచామృతాభిషేకాన్ని నిర్వహించారు.వైసీపీ నేత పోకలఅశోక్‌కుమార్‌ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. అనంతరం వినాయక స్వామి కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అణివేటి మండపం, సుపధ మండపం, ప్రధాన ఆలయాన్ని పూర్తిగా పుష్పాలు, అరటి బోదెలతో శోభాయమానంగా అలంకరించారు.వివాహానంతరం సిద్ధి,బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి ఉత్సవర్లను పల్లకిపై ఉంచి భాజాభజంత్రీలు వాయిస్తూ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు.ఏఈవో రవీంద్రబాబు, సూపరింటెండెంట్‌ కోదండపాణి, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ రవి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 01:08 AM