Share News

Green signal తహసీల్దార్ల బదిలీకి గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Jul 27 , 2024 | 01:30 AM

ఎన్నికల ప్రక్రియ ముగిసి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పొరుగు జిల్లాల్లోని తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నాలుగురోజుల క్రితం సీసీఎల్‌ఏను ఆదేశించింది. అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన కారణంగా తహసీల్దార్ల బదిలీలకు బ్రేక్‌ పడింది. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి శుక్రవారం రాత్రి తహసీల్దార్లను రిలీవ్‌ చేయాలని చెప్పడంతో తిరుపతి కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశాలు ఇచ్చారు.

Green signal తహసీల్దార్ల బదిలీకి గ్రీన్‌ సిగ్నల్‌

తిరుపతి(కలెక్టరేట్‌), జూలై 26: ఎన్నికల ప్రక్రియ ముగిసి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పొరుగు జిల్లాల్లోని తహసీల్దార్లను సొంత జిల్లాలకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నాలుగురోజుల క్రితం సీసీఎల్‌ఏను ఆదేశించింది. అయితే అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో రికార్డులు దగ్ధమైన కారణంగా తహసీల్దార్ల బదిలీలకు బ్రేక్‌ పడింది. ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి శుక్రవారం రాత్రి తహసీల్దార్లను రిలీవ్‌ చేయాలని చెప్పడంతో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో పనిచేస్తున్న 34 మంది పొరుగు తహసీల్దార్లు ఆయా మండలాల్లోని డీటీలకు బాధ్యతలు అప్పగించి రిలీవ్‌ అయ్యారు. ఇక పొరుగు జిల్లాల్లో పనిచేస్తున్న సుమారు 42మంది మన జిల్లాకు చెందిన తహసీల్దార్లు శనివారం సాయంత్రానికి కలెక్టరేట్‌లో రిపోర్టు చేయనున్నారు. వీరందరికీ రెండు, మూడ్రోజుల్లో పోస్టింగ్స్‌ ఇవ్వనున్నారు.

ప్రాధాన్యత మండలాల కోసం పైరవీలు

ఇప్పటికే రాష్ట్రంలోని ఉన్నతాధికారులు, ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, రాజకీయ నేతల నుంచి కొందరు తహసీల్దార్లు పైరవీలు మొదలుపెట్టారు. తమకు ప్రాధాన్యత గల మండలం కావాలని జిల్లా అధికారులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ భూములను అప్పటి ఎమ్మెల్యేలకు అప్పనంగా అప్పజెప్పిన తహసీల్దార్లను దూరంగా పెట్టి.. నిజాయితీగా పనిచేసేవారికి అవకాశం ఇవ్వాలని కూటమి నేతలు ప్రభుత్వానికి ఇప్పటికే విన్నవించారు.

Updated Date - Jul 27 , 2024 | 08:19 AM