Share News

నరకయాతన hellish

ABN , Publish Date - Dec 25 , 2024 | 02:28 AM

కోట మండలం కర్లపూడి బీసీ కాలనీలోని ఊడత వెంకటసుబ్బయ్యకు ముగ్గురు పిల్లలు. మొదటి ఆడబిడ్డ ఆరోగ్యంగా ఉంది. ఆ తర్వాత జన్మించిన ఇద్దరు కుమారులు.. నాగరాజు, హర్షకు చిన్నప్పటి నుంచీ శరీరం, ముఖం, నల్లగా మాడిపోయి దద్దులుగా ఉన్నాయి. చర్మంపై చెమట పట్టకుండా తడి ఆరిపోయి పట్టలు పట్టలుగా పగిలిపోతూ ఉంటుంది. ఆ క్రమంలో రక్తం, నీరు కారుతూ ఉంటాయి. రాత్రి వేళ నిద్రపోలేని పరిస్థితి. వర్షాకాలం ఒకలా.. ఎండలోకి వెళ్లితే మరోలా వీరిద్దరి చర్మం మరింతగా బిగిసుకుపోయి పగిలిపోతుంది. తమ పిల్లల నరకయాతనను చూడలేక తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు.

నరకయాతన hellish
నాగరాజు, హర్ష


పుట్టిననుంచీ అంతుపట్టని వ్యాఽధితో సతమతం

ఆదుకోవాలంటూ రెవెన్యూ సదస్సులో చిన్నారుల వేడుకోలు

మాడిపోయినట్లుండే శరీరం. వాతావరణ పరిస్థితులతో చర్మం పగుళ్లిస్తుంది. రక్తం కారుతుంది. తట్టుకోలేని మంటలతో ఆ ఇద్దరు చిన్నారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వీరిని చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. వీరి ఆరోగ్య బాగుకు దాతలు సహకరించాలని కోరుతున్నారు.

- కోట, ఆంధ్రజ్యోతి

కోట మండలం కర్లపూడి బీసీ కాలనీలోని ఊడత వెంకటసుబ్బయ్యకు ముగ్గురు పిల్లలు. మొదటి ఆడబిడ్డ ఆరోగ్యంగా ఉంది. ఆ తర్వాత జన్మించిన ఇద్దరు కుమారులు.. నాగరాజు, హర్షకు చిన్నప్పటి నుంచీ శరీరం, ముఖం, నల్లగా మాడిపోయి దద్దులుగా ఉన్నాయి. చర్మంపై చెమట పట్టకుండా తడి ఆరిపోయి పట్టలు పట్టలుగా పగిలిపోతూ ఉంటుంది. ఆ క్రమంలో రక్తం, నీరు కారుతూ ఉంటాయి. రాత్రి వేళ నిద్రపోలేని పరిస్థితి. వర్షాకాలం ఒకలా.. ఎండలోకి వెళ్లితే మరోలా వీరిద్దరి చర్మం మరింతగా బిగిసుకుపోయి పగిలిపోతుంది. తమ పిల్లల నరకయాతనను చూడలేక తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు. అప్పులుచేసి వీరిని చెన్నైలోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. జన్యులోపం ఉండొచ్చని.. పదేళ్ల తర్వాత చర్మం సర్జరీ చేస్తామని వైద్యులు చెప్పినట్లు వీరి తండ్రి వెంకటసుబ్బయ్య తెలిపారు. నిరుపేదలైన ఇక్కడికే వైద్యం చేయించలేక ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. దాతలు సాయం అందించాలని కోరుతున్నారు. ప్రస్తుతం కర్లపూడి ప్రభ్వుత పాఠశాలలో నాగరాజు 5వ తరగతి, హర్ష ఒకటో తరగతి చదువుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం కర్లపూడిలో జరిగిన రెవెన్యూ సదస్సుకు నాగరాజు, హర్ష చేరుకొని తమకు ప్రాణబిక్ష పెట్టాలని తహసీల్దారు జయజయరావును కోరారు. ఆయన రూ.5వేలు వితరణగా ఇచ్చారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వపరంగా ఆదుకునేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

Updated Date - Dec 25 , 2024 | 02:30 AM